Home » Entertainment » One Boy Proposed To Anushka Shetty
Entertainment

Anushka Shetty : అనుష్క‌కి ప్ర‌పోజ్ చేసిన ఒకే ఒక వ్యక్తి.. అత‌ను ఎవ‌రో తెలుసా?

Authored By
Sam C
The Telugu News | Published on: November 8, 2022, 2:20 pm
Advertisement

Anushka Shetty : తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ అనుష్క‌. తెలుగు .. తమిళ భాషల్లో అగ్రకథానాయికగా రాణించిన అనుష్క కొంతకాలంగా ఆమె ఇటు తెలుగులో గానీ .. అటు తమిళంలో గాని సినిమాలు చేయడం లేదు. అనుష్క ఇక సినిమాలు చేయడం మానుకున్నట్టేననే ప్రచారం కూడా జోరుగానే జరుగుతోంది. ‘సైలెన్స్’ సినిమా తరువాత ఆమె నుంచి మరో సినిమా రాకపోవడంతో ఏమైంద‌ని అంద‌రు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. నాయిక ప్రధానమైన ఓ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నట్టు, అందులో అనుష్క న‌టించ‌నున్న‌ట్టు వార్తలు వచ్చాయి.

Advertisement

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్స్ మాత్రం లేవు. పి.మహేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్క పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ ను వదిలారు. ప్రొఫెషనల్ చెఫ్ ‘అన్విత రవళి’ పాత్రలో ఆమె ఈ సినిమాలో నటిస్తోంది. కెరియర్ పరంగా ఇది ఆమెకి 48వ సినిమా. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమాకి, త్వరలోనే టైటిల్ ను ఖరారు చేయనున్నారు. ఇక ఇదిలా ఉంటే అనుష్క ఆ మ‌ధ‌య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను కొన్ని రోజులు మూడో తరగతి స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పేదాన్ని. అలాగే నా హైట్ ని, నా సీరియస్ మొహాన్ని చూసి చాలామంది నాకు ప్రపోజ్ చేయడానికి ఇష్టపడేవారు కాదు.

one boy proposed to anushka shetty

Advertisement

Anushka Shetty : ఎవ‌రో తెలుసా?

కానీ ఒక కుర్రాడు మాత్రం చాలా డేర్ గా నాకు ప్రపోజ్ చేశాడు. ఇక ఆ అబ్బాయితో ఈ విషయం మా నాన్న దగ్గరికి వెళ్లి చెప్పు అని చెప్పాను. అలాగే నేను పెళ్లికి, రిలేషన్ షిప్ కి అస్సలు వ్యతిరేకం కాదు.ఒకవేళ నేను ప్రేమలో పడితే ఆ విషయాన్ని అస్సలు దాచుకోను. అన్ని విషయాలలా ఆ మ్యాటర్ ని కూడా తప్పకుండా మీ అందరికీ చెబుతాను.అలాగే ప్రభాస్ గురించి నా గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ ఆ ఇంటర్వ్యూలో అనుష్క క్లారిటీ ఇచ్చింది. అయితే అనుష్క త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయంగా తెలుస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి