Pakiza : నటి పాకీజా ఆవేదన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను వేడుకుంటూ వీడియో విడుదల | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pakiza : నటి పాకీజా ఆవేదన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను వేడుకుంటూ వీడియో విడుదల

 Authored By ramu | The Telugu News | Updated on :29 June 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Pakiza : నటి పాకీజా ఆవేదన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను వేడుకుంటూ వీడియో విడుదల

Pakiza  : తెలుగు సినీ నటి పాకీజా (వాసు) తన ఆర్థిక కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్న తాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాలూకూ సహాయాన్ని కోరుతూ ఒక భావోద్వేగ వీడియోను విడుదల చేశారు.

Pakiza నటి పాకీజా ఆవేదన చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ను వేడుకుంటూ వీడియో విడుదల

Pakiza : నటి పాకీజా ఆవేదన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను వేడుకుంటూ వీడియో విడుదల

Pakiza  ప్లీజ్ ఆదుకోండి..

“నేను గత మూడేళ్లుగా సినిమాల్లో లేను. షూటింగ్లు లేవు. ఆర్థికంగా పూర్తిగా కష్టాల్లో ఉన్నాను. చెన్నై నుంచి సొంత ఊరికి వచ్చేశాను. రెండు సార్లు విజయవాడ వచ్చాను. కానీ సీఎం గారినీ, పవన్ కళ్యాణ్ గారినీ కలవలేకపోయాను,” అంటూ ఆమె బాధను వ్యక్తం చేశారు.పిల్లలు, భర్త లేని తాను పూర్తిగా ఒంటరిగా ఉన్నానని, ఏపీ తరఫున ఏదైనా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. “మీ కాళ్లు పట్టుకుంటా. ఒక్కసారి చూస్తారనే ఆశతో వీడియో రిలీజ్ చేస్తున్నాను,” అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

పాకీజా చేసిన ఈ విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ పరిశ్రమలో పలు సహాయ పాత్రలతో గుర్తింపు పొందిన ఆమె పరిస్థితిపై స్పందన రావాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు స్పందిస్తారా అన్న‌ది చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది