
pallavi prashanth and rathika rose are in love in bigg boss 7
Pallavi Prashanth – Rathika : బిగ్ బాస్ హౌస్ bigg boss 7 లో రోజురోజుకూ గొడవలు పెరుగుతున్నాయి. గ్రూప్ రాజకీయాలు పెరిగాయి. జంటలు కూడా అయ్యారు. హౌస్ లో ఎవరి గోల వారిది. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. ఇప్పటికే తొలి వారం నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. ఈ వారం ఎవరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తారో తెలియదు కానీ.. నామినేషన్ల గురించి అస్సలు పట్టించుకోకుండా కంటెస్టెంట్లు ఎవరి పనుల్లో వాళ్లు ఉన్నారు. ఎవరి బిజీలో వారు ఉన్నారు. ఇక హౌస్ లో ఇప్పటికే జంటలు కూడా ఫామ్ అయ్యాయి. పల్లవి ప్రశాంత్, రతిక ఒక జంట కాగా, అర్జున్ కృష్ణ, శుభశ్రీ మరో జంట అయ్యారు. ప్రియాంక.. అమరదీప్ తో క్లోజ్ గా ఉంటోంది కానీ అది జస్ట్ ఫ్రెండ్ షిప్ మాత్రమే. ఇక శోభా శెట్టి, ప్రిన్స్ తో కాస్త క్లోజ్ గా ఉంటోంది.
అయితే.. ఈ జంటలన్నీ ఒక ఎత్తు అయితే.. రతిక, ప్రశాంత్ జంట మరో ఎత్తు. ఎందుకంటే వాళ్లు హౌస్ లో రొమాన్స్ చేస్తున్నారు. వాళ్ల రొమాన్స్ ను ప్రేక్షకులు చూడలేకపోతున్నారు. రైతు బిడ్డ అని చెప్పి హౌస్ లోకి వెళ్లి ఇలా రతికతో పులిహోర కలుపుతున్నావు ఏంట్రా బాబు అంటూ పల్లవి ప్రశాంత్ పై నెటిజన్లు తెగ ఫైర్ అవుతున్నారు. తినేటప్పుడు రతికతోనే, టాస్క్ చేసేటప్పుడు రతికతోనే.. ఎక్కడికెళ్లినా రతిక, ప్రశాంత్ ఇద్దరూ జంటగానే కనిపిస్తున్నారు.తాజా ఎపిసోడ్ లో వాళ్లిద్దరి రొమాన్స్ ను కూడా చూపించేశాడు బిగ్ బాస్. నీ దిల్ ఎవరికి ఇచ్చావు చెప్పు అంటూ రతిక.. ప్రశాంత్ ను అడుగుతుంది. దీంతో ప్రశాంత్ కు ఏం చెప్పాలో అర్థం కాదు. మెలికలు తిరిగిపోతాడు ప్రశాంత్. ఇదంతా పక్కన పెడితే అసలు నువ్వు నీ దిల్ ఎవరికి ఇచ్చావు చెప్పు అని అడుగుతాడు ప్రశాంత్. దీంతో నీకే ఇచ్చాను అంటుంది రతిక.
Pallavi Prashanth – Rathika : నా దిల్ నీకే ఇచ్చా.. హౌస్ లో రతిక, పల్లవి ప్రశాంత్ రొమాన్స్ రచ్చ.. బరితెగించేశారు
దీంతో మనోడు అస్సలు ఆగడు. బాబోయ్ అంటూ సిగ్గు పడుతూ మెలికలు తిరిగిపోతాడు ప్రశాంత్. సరే నువ్వు ఎవరికి ఇచ్చావో చెప్పు అంటూ ఫోర్స్ చేసి మరీ అడుగుతుంది రతిక రోస్. పక్కనే కూర్చొని చేతులు పట్టుకొని వాళ్లు చేసే రచ్చ చూసి ప్రేక్షకులకు మతులు పోతున్నాయి. ఏది ఏమైనా వీళ్ల ప్రేమ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాల్సిందే.
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
This website uses cookies.