Pawan Kalyan : పవన్ దగ్గర ఆస్తులు పెద్దగా లేవు.. ఆ పొలం కూడా అప్పు చేసి కొన్నాడన్న నాగబాబు

Authored By mallesh | The Telugu News | Published on: September 3, 2022, 12:30 pm

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. తమ్ముడు, జల్సా సినిమాలు చూస్తూ హ్యాపీగా గడుపుతున్నారు.మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ కళ్యాణ్‌కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చిరంజీవి, నాగబాబు, చరణ్ ఇలా అందరూ విషెస్ చెప్పారు. దేశవ్యాప్తంగా పవన్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిపై అంతులేని అభిమానాన్నిచూపిస్తున్నారు.

Pawan Kalyan : పవన్ అప్పులు చేసి ఆస్తి కొన్నాడు..

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన ఆస్తులపై వార్తలు వైరల్ అవుతుండటంతో మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ కు పెద్దగా ఆస్తులు లేవని కుండబద్దలు కొట్టాడు. ఈ ఒక్క కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు తమ్ముడు, జల్సా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ కూడా ఒక్కసారిగా ఈ విషయం తెలిసి షాక్ అయినట్టు సమాచారం.. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అందరికంటే ఎక్కువగా రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. ఆయన మార్కెట్ ఇటీవల కాలంలో చాలా బాగా పెరిగింది. ఎప్పుడైతే బాహుబలి వంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి ఎనలేని క్రేజ్ తీసుకువచ్చాయో పవన్ కూడా తన సినిమాలకు రెమ్యూనరేషన్ పెంచినట్టు సమాచారం.

Nagababu About Pawan Kalyan Properties And Land

Nagababu About Pawan Kalyan Properties And Land

అత్తారింటికి దారేది చిత్రం భారీ విజయం సాధించడంతో పవన్ ఒక్కో సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.. తన తమ్ముడి బర్త్ డే సందర్భంగా నాగబాబు పవన్ ఆస్తులపై కీలక కామెంట్ చేశారు. మాకు తాతలు సంపాదించి పెట్టిన వేల కోట్ల రూపాయల ఆస్తులు ఏవీ లేవు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోల కంటే పవన్ కళ్యాణ్ పారితోషకం ఎక్కువ.అయినప్పటికీ కళ్యాణ్ బాబు దగ్గర ఎంత ఆస్తి ఉందని చెప్పుకునే పరిస్థితి లేదు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని రాజకీయాలకు, సేవా కార్యక్రమాలకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాడు. డబ్బులు దాచిపెట్టుకుని ఆస్తులు పెద్దగా పోగెసుకోలేదు. ఇక శంకర్ పల్లిలో వ్యవసాయం కోసం 8 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశాడు. అది కూడా ఫైనాన్స్‌లో తీసుకుని నెలనెలా ఈఎంఐ కడుతున్నాడని నాగబాబు చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp