
పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ షూటింగ్ రీసెంట్ గా కంప్లీటయిన సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం ప్రమోషన్స్ మీద దృష్ఠి పెట్టారు దర్శక, నిర్మాతలు. పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత స్క్రీన్ మీదకి వస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరించాడు. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ ల పోస్టర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ వకీల్ సాబ్ సినిమా నుంచి టీజర్ రాబోతున్నట్టు ఈ పోస్టర్ లోనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. శృతి హాసన్ గెస్ట్ రోల్ లో నటిస్తుండగా టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రల్లో నటించారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతమందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి.
కాగా తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చి ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. వకీల్ సాబ్ ఫైనల్ షూటింగ్ గత నెల జరిగిన సగతి తెలిసిందే. ఈ ఫైనల్ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ సీన్స్ అన్ని సింగిల్ టేక్ లో కంప్లీట్ చేశాడట. అంతేకాదు సీన్స్ కంప్లీట్ చేసేందుకు ఏకంగా 4 కెమెరాలు వాడినట్టు చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సీన్ మొత్తం డీటేయిల్డ్ గా తెలుసుకొని ఒకే టేక్ లో కంప్లీట్ చేసి అందరీని ఆశ్చర్యపరచాడని తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఇదే పద్దతిని పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాలకి ఉపయేగించబోతున్నారట. అందుకే మలయాళ హిట్ సినిమాకి పవన్ కళ్యాణ్ కేవలం 30 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.