#image_title
Pawan Kalyan – Ram Charan : ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎటువంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. వారికి సంబంధించిన ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇక తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ఇటలీలో గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ చాలా సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఒక్కొక్కరు గ్రాండియర్ లుక్ లో కనిపించారు. నాగబాబు, వరుణ్ తేజ్, చిరంజీవి ఇలా అందరూ స్పెషల్ డిజైనింగ్ దుస్తుల్లో కనిపించారు. పెళ్లికూతురు లావణ్య త్రిపాఠి చీర డిజైన్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన దుస్తులను స్టైలిష్ గా చేయించుకున్నట్లుగానే కనిపిస్తుంది. పెళ్లి వేడుకలో బన్నీ ఫోటోలు స్టైలిష్ గా ఉండడంతో వైరల్ అవుతున్నాయి. తాజాగా చిరంజీవి షేర్ చేసిన ఫోటోలో అందరూ గ్రాండియర్ గా డిజైనర్ దుస్తుల్లో కనిపించారు. కానీ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సింపుల్ గా కనిపించారు. పవన్ కళ్యాణ్ అయితే సింపుల్ గా టీ షర్ట్, ప్యాంట్ లో దర్శనమిచ్చాడు. ఇక రామ్ చరణ్ ఓ షర్ట్, ప్యాంటు వేసుకున్నాడు. మిగతా వాళ్లంతా ట్రెడిషనల్ దుస్తుల్లో కనిపించారు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు సింపుల్ ఔట్ ఫిట్స్ లోనే కనిపిస్తూ ఉంటారు. రామ్ చరణ్ కూడా అప్పుడప్పుడు ఇలానే కనిపిస్తుంటారు. పండుగ ఏదైనా సెలబ్రేషన్స్ ఏమైనా ఇద్దరు అందరికీ భిన్నంగా ఉంటారని మరోసారి రుజువైంది. ఈ ఫోటోలో ఎంతమంది ఉన్నా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మీదకి దృష్టి వెళుతుంది. ఈ వేడుకలో రామ్ చరణ్ అల్లు అర్జున్ కలిసి ఉన్న ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇలా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ సింపుల్ లుక్ లో కనిపించడంతో బాబాయ్ అబ్బాయ్ ఒకే రకం అని వీరిద్దరి రూటు సెపరేటు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
GST 2.0 : జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే…
Oneplus | ప్రీమియం లుక్, ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికీ మంచి సమయం ఇది. రూ.30,000 - రూ.40,000…
AP District Court Jobs | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న…
Bigg Boss9 | తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9’ సెప్టెంబర్…
Anushka Shetty | టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై…
Allari Naresh | అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆల్కహాల్. ఈ సినిమా మెహర్ రాజ్…
Water | ఉదయం లేవగానే చాలామందికి బ్రష్ చేయడం, తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ పెద్దవాళ్లు "బ్రష్ చేసిన…
This website uses cookies.