Bheemla Nayak : భీమ్లా నాయక్‌ మళ్లీ షూటింగ్‌ మొదలెట్టారేంట్రా బాబు.. ఫ్యాన్స్ అసంతృప్తి

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల అవుతుంది అని అంతా భావించారు. పలు సందర్భాల్లో నిర్మాత నాగ వంశీ భీమ్లా నాయక్ సినిమా విడుదల చేసి తీరుతానని ప్రకటించాడు. సంక్రాంతికి కచ్చితంగా విడుదల అవుతుంది అని భావించిన సమయంలో పవన్ కళ్యాణ్ సూచన మేరకు పెద్ద సినిమాల కోసం ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత ప్రకటించాడు. కరోనా కారణంగా పెద్ద సినిమాలు కూడా విడుదల కాలేదు. సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల కాని కారణంగా భీమ్లా నాయక్‌ ను విడుదల చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేశారు.ఎంతో మంది విడుదల కావాలని ఆశించినా కాని భీమ్లా నాయక్ సినిమా నిర్మాతలు విడుదల చేయలేదు. పవన్ కళ్యాణ్ సినిమా వర్క్ ను పూర్తి చేయలేదు అనే టాక్ వినిపించింది.

ఫిబ్రవరి 25 వ తారీఖున కచ్చితంగా సినిమా వస్తుంది అని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. టిక్కెట్ల రేట్లు విషయంపై కూడా ఒక క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. సినిమా టికెట్ల రేట్లు పెంపుదల నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేస్తారని ప్రతి ఒక్కరు నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో భీమ్లా నాయక్ షూటింగ్ జరుగుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించడం అందరికీ ఆశ్చర్యం గా ఉంది. ఎప్పుడో సినిమా షూటింగ్ ని పూర్తి చేసినట్లుగా ప్రకటించిన యూనిట్ సభ్యులు మళ్లీ షూటింగ్ చేయడం తో అంతా కూడా విమర్శిస్తున్నారు. ఈ సినిమా ఇంకా ఎంత కాలం షూటింగ్ చేస్తారంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది.. సినిమా షూటింగ్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఇంకా ఏం కారణం చెప్పి వాయిదా వేస్తారు అంటూ అభిమానులు మేకర్స్ పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

pawan Kalyan bheemla nayak movie shooting again

సినిమా ఎలా వచ్చినా కూడా ఇలాంటి ఈ సమయం లో షూటింగ్ మళ్లీ చేయడం ఏంటి అంటున్నారు. కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలను షూట్ చేస్తున్నామని మేకర్ చెబుతుండగా మరి కొందరు మాత్రం సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల విషయంలో అసంతృప్తి వ్యక్తం అయింది. అందుకే సినిమా కు సంబంధించిన ఆ సన్నివేశాలను రీషూట్ చేశారని అందుకోసం పవన్ కళ్యాణ్ ఏకంగా పది రోజులు డేట్లు ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ రూపొందుతున్న ఈ సినిమా కచ్చితంగా అభిమానులను నచ్చే విధంగా మెచ్చే విధంగా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఒక మలయాళం సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు ఇక రానా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యా మీనన్ ఈ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందించినట్లు తెలుస్తోంది. షూటింగ్ ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుంది.. ఫిబ్రవరి 25న సినిమా వస్తుందా రాదా అనే విషయం పై క్లారిటీ రావాలంటే మరో వారం రోజులు వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ సాయం.. వార్త‌ల‌పై అస‌లు క్లారిటీ ఇదే..!

Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…

6 minutes ago

Samantha : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…

1 hour ago

Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా?

Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్ద‌రికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…

2 hours ago

Girl : తాగే వాడే కావాలి అంటూ యువ‌తి డిమాండ్.. క‌ట్నంగా బైక్, ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తా..!

Girl  : ఇటీవ‌ల కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొంద‌రు మాట్లాడే మాట‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.…

3 hours ago

Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Sreeleela  : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల‌. పుష్ప 2 సినిమాలో…

4 hours ago

Food : మీరు తినే ఫుడ్ ని ఈ విధంగా తీసుకుంటున్నారా… ఇలా తీసుకుంటే బకెట్ తన్నేస్తారు…?

Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…

5 hours ago

Telangana Jobs : నిరుద్యోగ యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లోనే 5 జాబ్ నోటిఫికేష‌న్స్‌

Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభ‌వార్త‌. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

6 hours ago

Gut Health : మీ పేగు ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ 7 ప్రీబయోటిక్ ఆహారాలు తీసుకోండి… మీరు షాకే..?

Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…

7 hours ago