Pawan Kalyan : అంత సున్నితంగా ఉండకండి.. ప్రతి దాడిని తిప్పికొట్టండి : పవన్ కళ్యాణ్..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : అంత సున్నితంగా ఉండకండి.. మీకు దమ్ముంటే ఎలా దాడి చేయాలో అలా దాడి చేయండి : పవన్ కళ్యాణ్..!
Pawan Kalyan : అంత సున్నితంగా ఉండకండి.. ప్రతి దాడిని తిప్పికొట్టండి : పవన్ కళ్యాణ్..!
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందుతూ.. షో షోకి వసూళ్లను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో విజయోత్సవ వేడుకను నిర్వహించింది చిత్ర బృందం.
Pawan Kalyan : అంత సున్నితంగా ఉండకండి.. ప్రతి దాడిని తిప్పికొట్టండి : పవన్ కళ్యాణ్..!
Pawan Kalyan అభిమానులకి ధైర్యం అందించిన పవన్ కళ్యాణ్.. ధైర్యంగా ఉండాలంటూ సూచన
ఈ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “నా జీవితం వడ్డించిన విస్తరి కాదు. నా జీవితంలో ఏదీ అంత తేలికగా జరగదు. ఈ సినిమా విడుదల విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా 29 ఏళ్ళ సినీ ప్రయాణంలో నేను ఒక సినిమాని ఇలా ప్రమోట్ చేయడం ఇదే మొదటిసారి అని అన్నాడు. హరిహర వీరమల్లు చిత్రాన్ని బాయ్ కాట్ చేసే ప్రయత్నాలు జరిగాయి… నా సినిమా వాళ్లను అంత భయపెట్టిందా?
హరిహర వీరమల్లు పార్ట్-1లో ఏవైనా తప్పులు ఉంటే చెప్పండి… సెకండ్ పార్ట్ లో సరిదిద్దుకుంటాం. మా సినిమా గురించి నెగెటివ్ గా మాట్లాడుతున్నారంటే మేం బలమైన వాళ్లమనే అర్థం.నేను ఏ స్థాయికి ఎదిగానో నాకు తెలియదు… నాకు తెలిసిందల్లా ధైర్యంగా ఉండడమే.నేను ఎప్పుడూ డిప్రెషన్ కు లోనవ్వను. విజయం కంటే ఎలాగోలా బతకడమే ముఖ్యం అనుకుంటాను. అభిమానులు అంత సున్నితంగా ఉండకండి. లైఫ్ ఎంజాయ్ చేయండి. మీకు దమ్ముంటే ఎలా దాడి చేయాలో అలా దాడి చేయండి. ప్రతి దానికి నలిగిపోతే ఎలా? అంటూ వారికి ధైర్యం చెప్పారు.
