Pawan Kalyan : ఇన్నాళ్లకు పవన్ నోటి వెంట సినిమాల ప్రస్తావన.. .. OG వీర లెవల్ అంతే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan : ఇన్నాళ్లకు పవన్ నోటి వెంట సినిమాల ప్రస్తావన.. .. OG వీర లెవల్ అంతే..!

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ హీరో కాస్త ఇప్పుడు కంప్లీట్ పొలిటిషియన్ గా మారాడు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు డిప్యూటీ సీఎం దక్కించుకుని రాష్ట్ర ప్రజలకు సంకేషమ పాలన లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఏపీ కోసం డే అండ్ నైట్ డ్యూటీ చేసేందుకు సిద్ధం అనేలా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇక రీసెంట్ గా కాకినాడలోని ఉప్పాడ వెల్లి అక్కడ ప్రజలను కలిసిన పవన్ కళ్యాణ్ తన సినిమాల గురించి ప్రస్తావించారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 July 2024,9:00 pm

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ హీరో కాస్త ఇప్పుడు కంప్లీట్ పొలిటిషియన్ గా మారాడు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు డిప్యూటీ సీఎం దక్కించుకుని రాష్ట్ర ప్రజలకు సంకేషమ పాలన లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఏపీ కోసం డే అండ్ నైట్ డ్యూటీ చేసేందుకు సిద్ధం అనేలా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇక రీసెంట్ గా కాకినాడలోని ఉప్పాడ వెల్లి అక్కడ ప్రజలను కలిసిన పవన్ కళ్యాణ్ తన సినిమాల గురించి ప్రస్తావించారు.

పవన్ గెలవడం ఫ్యాన్స్ కి హ్యాపీగా ఉన్నా ఆయన ఇక మీదట సినిమాలు చేస్తారా లేదా అన్న కన్ ఫ్యూజన్ అయితే ఉండేది. ఉప్పాడ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఓజీ ఓజీ అంటుంటే మనకు ఇక సినిమాలు అవసరం అంటారా.. మళ్లె మీరే రోడ్లు బాగాలేవని అంటారని నవ్వుతూ అన్నారు. తను దర్శక నిర్మతలతో రెండు మూడు రోజులు సినిమాలకు పనిచేస్తానని చెప్పా.. ఓజీ సినిమా బాగుంటుంది మీ అందరు చూడండని అన్నారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan OG అంటే పవన్ కి స్పెషల్ అన్నమాట

పవన్ సినిమాలకు గుడ్ బై చెబుతారన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టే లెక్క. ఇక ఓజీ సినిమా పై పవన్ కి ఉన్న ప్రేమ స్పెషల్ ఇంట్రెస్ట్ మరోసారి బయట పడింది. ఫ్యాన్స్ అన్నారని కాదు ఆయన కూడా ఓజీ సినిమా మీద చాలా ఫోకస్ గా ఉన్నారని అర్ధమవుతుంది. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు.

Pawan Kalyan ఇన్నాళ్లకు పవన్ నోటి వెంట సినిమాల ప్రస్తావన OG వీర లెవల్ అంతే

Pawan Kalyan : ఇన్నాళ్లకు పవన్ నోటి వెంట సినిమాల ప్రస్తావన.. .. OG వీర లెవల్ అంతే..!

పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటుగా హరి హర వీరమల్లు సినిమా కూడా చేస్తున్నాడు. ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా డైరెక్షన్ నుంచి క్రిష్ తప్పుకోగా ఏ.ఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ రెండు సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా ఫ్యాన్స్ ని మెప్పించేలా ఈ సినిమాలు ఉంటాయని మేకర్స్ అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది