Pawan Kalyan : ఖుషీ టైటిల్‌తో సమంత- విజయ్ దేవరకొండ చిత్రం.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..!
Pawan Kalyan : ప్రస్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతున్న యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఆయన నటించిన లైగర్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విజయ్ దేవరకొండ త్వరలో పూరీ జగన్నాథ్‌తో మరో సినిమా చేయనున్నాడు. దీనికి జనగణమన అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అలానే విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
విజయ్ – సమంత సినిమా ఈనెల 21నే ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది. ఆ తర్వాత ఇదే నెల 23నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.ఫస్ట్ షెడ్యూల్‌ను కశ్మీర్‌లో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో విజయ్ ఆర్మీ అధికారిగా కనిపించనున్నట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ‘మజిలీ’ తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, విజయ్ ఇందులో హీరోగా చేయడంతో ఈ సినిమాపై ఎంతో ఆసక్తి నెలకొంది .

Pawan Kalyan Fans comments khushi title used for Samantha Vijay Devarakonda movie
Pawan Kalyan : ఫ్యాన్స్ ని హర్ట్ చేయకుండా ఉంటారా..!
విజయ్ దేవరకొండ, సమంత కలిసి `మహానటి` లో జోడీగా నటించారు. ఇందులో వీరి లవ్ స్టోరీ ఆద్యంతం ఆకట్టుకుంది. కాసేపే అయినా సావిత్రి జీవితానికి పారలల్‌గా రన్ అవుతూ మ్యాజిక్ చేసింది. ఇప్పుడు శివ నిర్వాణ సినిమాలో పూర్తి స్థాయిలో జోడీగా కనిపించబోతున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయబోతున్నారు. టైటిల్ విషయంలో విజయ్, సమంత కలిసి పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని వాడుకోబోతున్నారట. పవర్ స్టార్ కెరీర్‌లో మైలురాయిలాంటి చిత్రం `ఖుషి` . సంచలన విజయం సాధించిన ఈ చిత్రం టైటిల్‌ని ఇప్పుడు విజయ్ దేవరకొండ, సమంత ల సినిమాకి పరిశీలిస్తున్నారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా ? దీనిపై పవన్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.