
Pawan Kalyan fans fire on Trivikram
Trivikram : టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎంత బిజీగా ఉన్నా సినిమాలకు మాత్రం సమయం కేటాయిస్తారు. ఏడాదికి ఒక్క సినిమా అయినా వచ్చేటట్లు చూస్తారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ ‘ భీమ్లా నాయక్ ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు సముద్రఖని దర్శకత్వం వహించిన ‘ బ్రో ది అవతార్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించింది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయి.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలు నేలకొలిపింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే డౌట్ అందరిలో ఉంది. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ పై, డైలాగ్స్ రాశారు. కథ మాత్రం సముద్రఖనిది అని సంగతి తెలిసిందే. తమిళంలో సముద్రఖని స్వీయ దర్శకత్వంలో నటించినా వినోదయ సీతం రీమేక్ గానే ఈ సినిమా తెరకెక్కింది. అయితే తెలుగులో నేటివిటికి వచ్చేసరికి కథనం పూర్తిగా మారిపోయింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రో సినిమాకి డైలాగ్స్, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ సమకూర్చిన నేపథ్యంలో డైరెక్షన్ పరంగా అతని ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అని జర్నలిస్ట్ తేజ్ ని అడిగారు.
Pawan Kalyan fans fire on Trivikram
అయితే త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇచ్చిన తర్వాత సినిమా షూటింగ్ టైంలో ఆయన అసలు జోక్యం చేసుకోలేదని తేజ్ క్లారిటీ ఇచ్చారు అతను అలా చేసి టైప్ కాదు అని కూడా తేల్చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో త్రివిక్రమ్ ప్రమేయం ఉన్నా కూడా మేకింగ్ పరంగా మాత్రం అతను అసలు ఇన్వాల్వ్ అవ్వరని చెప్పుకొచ్చారు. అభిమానులు తన నుంచి ఎలాంటి అంశాలు ఎక్స్ పెక్ట్ చేస్తారనేది పవన్ కళ్యాణ్ కి తెలుసు, దానికి తగ్గట్టుగా అతని స్టోరీల ఎంపిక ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మీద కానీ బ్రో సినిమా మేకింగ్ మీద కానీ ఇన్వాల్వ్ అవ్వలేదని తేజ్ ఈ ఇంటర్వ్యూ తో క్లారిటీ ఇచ్చారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.