Bheemla Nayak : పవన్ ను కేవలం అవసరానికే వాడుకుంటున్నారా..ముదురుతున్న భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ వివాదం..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొద్ది రోజులుగా విడుదల అవుతూ వస్తున్న సినిమా పోస్టర్లు, ట్రైలర్లు, పాటలు చిత్రం పై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా..వారి ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. నిజానికి ఈ సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ కానుందని ప్రకటించారు. కానీ ఊహించని విధంగా సంక్రాంతి రేసు నుంచి భీమ్లానాయక్ సినిమాను తప్పించడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభిమాన నటుడి సినిమా భీమ్లానాయక్ సినిమా అన్నీ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉండగా..
చివరి నిమిషంలో ఇలా చేయడం భావ్యం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆర్ ఆర్ ఆర్ చిత్రం కోసమే పవన్ ను ఒప్పించి మరి భీమ్లానాయక్ ను పోస్ట్ పొన్ చేయించారని పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. పవన్ ను తమ అవసరానికి వాడుకుంటున్నారని మండి పడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ కోసం నోరు కూడా తెరిచి మాట్లాడని వారు.. నేడు ఓ సినిమా కోసం మరో సినిమాను వాయిదా వేయించడం సబబు కాదని అంటున్నారు. కనీసం ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు కూడా పవన్ వైపు ఒక్కరూ నిలబడలేదని గుర్తు చేస్తున్నారు. అలాంటి వారి గురించి పవన్ ఎందుకు ఆలోచించాలని ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీ కోసం గొంతు చించుకొని ప్రభుత్వాన్ని దమ్ముగా ప్రశ్నిస్తే.. ఒక్కడంటే ఒక్కడు ముందుకు రాలేదన్నారు.
Bheemla Nayak : పవన్ ను అవసరానికి వాడుకుంటున్నారు..!
భీమ్లా నాయక్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే.. రాజమౌళి ఆ చిత్ర నిర్మాత చినబాబు, పవన్ కళ్యాణ్ అభినందనీయులు అంటూ కామెంట్ చేశారు. ఆ మరుక్షణమే ఆయనపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడ్డారు. ఆర్ ఆర్ ఆర్ కోసం.. సంక్రాంతి బరి నుంచి ఆఖరి నిమిషంలో భీమ్లా నాయక్ ను తప్పించారని ఆరోపిస్తూ రాజమౌళి పై మండి పడుతున్నారు. మరికొందరు సినిమా పోస్ట్ పోన్ వెనుక దిల్ రాజు స్వార్ధం కూడా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడీ వివాదం హాట్ టాపిక్ కాగా.. పవన్ అభిమానులతో పాటు అనేక మంది నెటిజన్లు.. వేరెవరో సినిమాల కోసం భీమ్లా నాయక్ ను వాయిదా వేయడం పద్దతి కాదంటున్నారు.