Home » Entertainment » Pawan Kalyan Former Wife Renu Desai About Non Vegetarian
Entertainment

Renu Desai : కేవలం 15 నిమిషాల సుఖం కోసం అంతకు తెగించాలా? రేణు దేశాయ్ సంచలన కామెంట్స్ వైరల్..

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: December 18, 2021, 7:13 pm
Advertisement

Renu Desai : రేణు దేశాయ్ అనే పేరు చదవగానే మనకు గుర్తొచ్చే మరో పేరు పవన్ కళ్యాణ్. అవును.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య తను. పవన్ కళ్యాణ్ వల్లనే రేణు దేశాయ్ ఈ దేశానికి పరిచయం అయింది. బద్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో చాలా ఏళ్ల పాటు సహజీవనం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ ఒక్కటయ్యారు. అప్పటికే పవన్ కళ్యాణ్ కు మొదటి పెళ్లి అయి విడాకులు కూడా తీసుకున్నాడు.తెలుగు ఇండస్ట్రీలో రేణు దేశాయ్ నటించింది రెండే సినిమాలు. ఒకటి బద్రి, రెండోది జానీ.

Advertisement

ఈ రెండు సినిమాలతోనే తను ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలు పుట్టిన తర్వాత కొన్నేళ్లకు రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరూ విడిపోయారు. దీంతో తన పిల్లలను తీసుకొని రేణూ పూణే వెళ్లిపోయింది.రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తో విడిపోయినా తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీతో అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను, తన పిల్లల గురించి కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.

pawan kalyan former wife renu desai about non vegetarian

Advertisement

Renu Desai : పవన్ కళ్యాణ్ తో విడిపోయినా తెలుగు సినీ అభిమానులతో టచ్ లో ఉంటున్న రేణు

రేణు దేశాయ్… సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటుంది. తను చేసే మంచి పనులకు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎప్పుడూ మద్దతు తెలుపుతూ ఉంటారు. తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.నేను శాకాహారిగా మారిపోయా. ఎందుకంటే.. జంతువును చంపి తినడం అనేది కరెక్ట్ కాదు. వాటిని టార్చర్ పెట్టడం, వాటి జీవితాన్ని నాశనం చేయడం.. మన కోసం వాటిని హింసించడం తప్పు అని తెలుసుకున్నా. కేవలం 15 నిమిషాల సుఖం కోసం వాటిని బలి చేయడం కరెక్ట్ కాదు. అందుకే నేను శాకాహారిగా మారిపోయా.. అని పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ను చూసిన నెటిజన్లు.. రేణూకు సపోర్ట్ చేస్తున్నారు. కరెక్ట్ మేడమ్.. మీరు చెప్పింది నిజం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి