pawan kalyan
Pawan Kalyan ; టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్ సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ‘ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను హరిష్ శంకర్ దర్శకత్వ వహిస్తున్నాడు. అంతకుముందు పవన్ కళ్యాణ్ హరిష్ శంకర్ కాంబినేషన్లో ‘ గబ్బర్ సింగ్ ‘ సినిమా వచ్చింది ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని రెడీగా ఉన్నా ఆయన డేట్స్ దొరకక సినిమా ఆలస్యం అయింది. ఈ సినిమా ఎనౌన్స్ చేసి దాదాపుగా సంవత్సరం కావస్తుంది.
Pawan Kalyan got an industry hit combination again
ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళిన ఈ సినిమా అవుట్ పుట్ కిరాక్ వస్తుందని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ ను ఫిక్స్ చేశారు. గబ్బర్ సింగ్ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఎంత హెల్ప్ అయిందో తెలిసిందే. ఆ సినిమాలో సాంగ్స్ అప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు కూడా అంతకుమించి సాంగ్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు దేవిశ్రీప్రసాద్. దానికి సంబంధించిన స్పెషల్ వీడియోను నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేశారు. హరీష్ శంకర్ దేవిని ఆహ్వానిస్తూ సినిమా గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈలోగా సాంబా రాసుకో అంటూ డైలాగ్ వస్తుంది.
మొత్తానికి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ కన్ఫామ్ అయ్యాడు. దీంతో అభిమానులు ఇండస్ట్రీకి హిట్ కాంబినేషన్ మళ్ళీ కుదిరింది ఇక చెడుగుడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీగా తెరకెక్కిస్తున్నారు. తెరి రిమేక్ గా మూల కథని మాత్రమే తీసుకొని సినిమా స్క్రీన్ ప్లే మొత్తం హరీష్ శంకర్ తనదైన స్టైల్ లో రాసుకున్నారట. పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ డైరెక్ట్ చేస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేయబోతున్నాడు హరీష్ శంకర్. మరి వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.