Pawan Kalyan : స్వయంగా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది కదరా బాబూ..!

Authored By vamana sai | The Telugu News | Published on: June 11, 2022, 10:00 am

Pawan Kalyan : ఈ మధ్య మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి రక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి. గతంలో మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా పవన్ మళ్ళీ అదే సీన్ రిపీట్ చేయబోతున్నాడని..రాజకీయాల కోసం మళ్ళీ సినిమాలకు పవన్ బ్రేక్ వేయబోతున్నాడని..ఇప్పుడు కమిటైన సినిమాల పరిస్థితేంటీ..సగం సినిమా షూటింగ్స్ అయిన సినిమా నిర్మాతల పరిస్థితేంటీ అంటూ నెట్టింట రక రకాల వార్తలు వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. కరోనా గనక దెబ్బకొట్టకపోయి ఉంటే ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలన్ని పూర్తి చేసేవారు పవన్.

కానీ, కరోనా కాకుండా మరెన్నో కారణాల వల్ల ఆయన సినిమాలు షూటింగ్ దశలోనే నిలిచిపోయాయి. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు అయితే ఏకంగా 15 నుంచి 16 నెలలు ఆగిపోయింది. ఈ సినిమా ఇక లేదనే కామెట్స్ వినిపించాయి. కానీ, గత నెల నుంచి మళ్ళీ షూటింగ్ మొదలైన వీరమల్లు సినిమా చిత్రీకరణ చక చకా కంప్లీట్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు గనక పూర్తైతే ఈ ఏడాది రిలీజ్ చేసే అవకాశం ఉంది. లేదంటే 2023 సంక్రాంతికైనా రిలీజ్ ప్లాన్ చేస్తారట.

Pawan Kalyan himself had to give clarity

Pawan Kalyan himself had to give clarity

Pawan Kalyan : భవదీయుడు భగత్‌సింగ్ ఆగిపోలేదు ఉంది..పవన్

అయితే, ఇదే టాక్ గతకొన్ని రోజులుగా హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో రూపొందాల్సిన భవదీయుడు భగత్‌సింగ్ సినిమా గురించి వినిపిస్తోంది. హరీష్‌కు పవన్ హ్యాండ్ ఇచ్చాడని..భవదీయుడు ఇప్పట్లో ఉండదని వార్తలు రాస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే, నిర్మాతలు దర్శకులు
క్లారిటీ ఇచ్చారు. అయినా ఆ రూమర్స్ ఆగడం లేదు. దాంతో ఇటీవల జరిగిన నాని సినిమా అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా హాజరైన పవన్ కళ్యాణ్ చివరిలో భవదీయుడు భగత్‌సింగ్ ఆగిపోలేదు ఉంది అని స్వయంగా క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌కు
స్వయంగా పవన్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఆ వార్తలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

vamana sai

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp