Pawan Kalyan : అన్నా, వదినకు అందుకే పాదాభివందనం చేశా.. పవన్ కళ్యాణ్ కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : అన్నా, వదినకు అందుకే పాదాభివందనం చేశా.. పవన్ కళ్యాణ్ కామెంట్స్..!
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సినిమా ప్రమోషన్స్ కి ఎప్పుడూ దూరంగా ఉంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి మాత్రం హాజరై వెళ్లిపోతుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ Hari Hara Veera Mallu Movie Review హరిహర వీరమల్లు చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Pawan Kalyan : అన్నా, వదినకు అందుకే పాదాభివందనం చేశా.. పవన్ కళ్యాణ్ కామెంట్స్..!
Pawan Kalyan : ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పార్టీ ఎమ్మెల్యేలు కొందరు అతిథులుగా హాజరయ్యారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ నటనలో గురువైన సత్యానంద్ కూడా అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆయనకు పాదాభిందనం చేశారు. అనంతరం మాట్లాడిన పవన్ .. నన్ను మా అన్నయ్య, వదిన బలంగా నమ్మారు.. అందుకే నా గెలుపు అనంతరం వాళ్ళిద్దరికీ పాదాభివందనం చేశా .వాళ్లు నాకు కనిపించే దేవుళ్లు అని అన్నాడు.
నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేవాడిని కాదు. ఇంట్లో ఉంటే పాడైపోతానని చిరంజీవి Chiranjeevi గారు భయపడేవారు. ఒక 16 ఏళ్ల అమ్మాయిని పెంచినట్లు బయటకు వెళ్లకుండా నన్ను ఇంట్లోనే పెట్టేసేవారు. అలాంటి నన్ను బయట పడేస్తే తప్ప వీడు ఏదోకటి నేర్చుకోడు అని సత్యానంద్ దగ్గరకు పంపించారు. 1992లో నేను వైజాగ్ కి వచ్చాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.