Pawan Kalyan: చిరంజీవి గారి వల్లే నేను, రామ్ చరణ్ ఈ స్థాయిలో ఉన్నాం.. పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైరల్
ప్రధానాంశాలు:
Pawan Kalyan: చిరంజీవి గారి వల్లే నేను, రామ్ చరణ్ ఈ స్థాయిలో ఉన్నాం.. పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైరల్
Pawan Kalyan: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ Game Changer సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమహేంద్రవరంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ Pawan Kalyan సినిమా టికెట్ల రేట్ల పెంపు, రాజకీయ అంశాలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేతత్వం రామ్‌చరణ్‌ది అని అన్నారు పవన్ కళ్యాణ్. రామ్‌చరణ్ పుట్టినప్పుడు తాను ఇంటర్ చదువుతున్నట్లు తెలిపారు. రాముడి చరణాల వద్ద ఉండే వ్యక్తి ఆంజనేయుడు. ఎంత ఎదిగినా, శక్తిమంతుడైనా, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని తన తండ్రి రామ్‌చరణ్ పేరు పెట్టారని పవన్ కళ్యాణ్ చెప్పారు.
Pawan Kalyan: చిరంజీవి గారి దయ వల్లనే..
అన్నయ్య చిరంజీవి తనకు తండ్రి లాంటివారని, చరణ్ తనకు తమ్ముడి లాంటివాడన్నారు. చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడినని అన్నారు. ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన రామ్‌చరణ్ బంగారమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏడేళ్ల వయస్సులోనే రామ్‌చరణ్ హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడని పవన్ చెప్పారు. ఇంత ప్రతిభ, సమర్థత ఉందని, ఎవరికీ తెలియదన్నారు. సుకుమార్ తీసిని రంగస్థలంలో రామ్‌చరణ్ నటన చూసి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందనుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో తప్పకుండా రావాలన్నారు. చిరంజీవి వారసుడు అలా కాకపోతే ఎలా ఉంటాడు. తండ్రి మెగాస్టార్ అయితే.. కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడని అన్నారు పవన్.
చిరంజీవి సినిమా తొలినాళ్లలో ఎంత కష్టపడ్డారని అన్నారు. ఇప్పటిలా సేఫ్టీ సౌకర్యాలు లేకపోవడంతో తరచూ గాయపడేవారన్నారు.నేటి యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే.. మీలో మీకు గొప్ప ధైర్యం ఉంది. తలచుకుంటే మెగాస్టార్ చిరంజీవిలా మీరు మీకు నచ్చిన రంగంలో సాధించగలరు. చిరంజీవి ఇచ్చిన ఊతం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తన కుటుంబం ఏ హిరో సినిమా పోవాలని కోరుకోదని అన్నారు. ఈవెంట్‌లో . చిరంజీవి గురించి గొప్పగా చెప్పారు. బేసిక్‌గా పవన్ అన్నయ్య గురించి తరచూ చెబుతుంటారు, కానీ ఏ విషయం చెప్పాలో అంతే చెబుతారు. కానీ ఈ ఈవెంట్‌లో మాత్రం చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పారు. తాను డిప్యూటీ సీఎం అయినా, మన్యంలో కాలినడకన వెళ్లగలిగినా,ఈ స్థాయికి ఎదిగినా, చరణ్ గ్లోబల్ స్టార్ అయినా దానికి మూలం చిరంజీవి అని, ఆయన కష్టం వల్లే తాము ఎదిగామని, మూలాలు ఎప్పుడూ మర్చిపోకూడదని తెలిపారు పవన్.
రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయినా, ఆస్కార్ వేదిక వరకు వెళ్లినా, విజయం గర్వం ఉండదని, డౌన్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తాడని, తమ ఫ్యామిలీ అహంకారం ఉండదని తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే లక్షణం చిరంజీవి నుంచి నేర్చుకున్నాడని రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు.