Himaja : ఇంతకంటే ఏం కావాలి.. ఆ లేఖతో గాల్లో తేలిపోయిన హిమజ

Authored By Cinema Desk | The Telugu News | Updated on: March 8, 2021, 1:26 pm

Himaja : ఓ అభిమానికి తన ఆరాద్య దైవమైన హీరో నుంచి లేఖ వస్తే అంత కంటే ఎక్కువ ఆనందాన్ని కలిగించేది ఇంకేం ఉంటుంది. ప్రస్తుతం బిగ్ బాస్ బ్యూటీ హిమజ కూడా అదే ఫీలింగ్‌లో ఉంది. అసలే హిమజ ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. అయితే ఈ మేరకు ఆమె షేర్ చేసిన కొన్ని పోస్ట్‌లు తెగ వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నానంటూ హిమజ షేర్ చేసిన ఫోటోలు ఓ రేంజ్‌లో హల్చల్ చేశాయి.

Pawan kalyan : ఆ లేఖతో గాల్లో తేలిపోయిన హిమజ

అయితే తాజాగా హిమజ మరో పోస్ట్ చేసింది. ఇందులో ఏకంగా పవన్ కళ్యాణ్ తన స్వహస్తాలతో రాసిన లేఖ ఉంది. అందులో.. హిమజ గారికి అన్ని శుభాలు కలగాలని, ప్రొఫెషనల్‌గా ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ.. పవన్ కల్యాణ్ అని రాసి ఉంది. మొత్తానికి ఇలా పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి లేఖ రావడంతో హిమజ షాక్ అయింది. అది చూసిన జనాలు మరింతగా షాక్ అవుతున్నారు. ఇంతకన్నా అదృష్టం ఏమైనా ఉంటుందా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు…

మొత్తానికి క్రిష్ పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది. ఈ మేరకు వదిలిన అప్డేట్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. మహేష్ బాబు సర్కారు వారి పాటకు పోటీగా పవన్ కళ్యాణ్ సినిమా దిగబోతోంది. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్‌ను మహాశివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల కాబోతోంది. ఈ మూవీని ఏఎం రత్నం నిర్మిస్తోండగా.. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ కనిపించబోతోన్నట్టు తెలుస్తోంది.

Cinema Desk

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp