Home » Entertainment » Pawan Kalyan Not Finished At Least One Movie In Confirmed 2 Movies
Entertainment

Pawan Kalyan : పవన్‌ ఆ టైమ్‌ దగ్గర పడింది.. ఒక్కటైనా పూర్తి అయ్యేనా?

Authored By
aruna
The Telugu News | Published on: August 11, 2022, 6:20 pm
Advertisement

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాజకీయాలు మరియు సినిమాని రెండింటిని బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడుతున్నట్లు గా అనిపిస్తుంది. ఆయన సినిమాలు మరియు రాజకీయం రెండు తనకు రెండు కళ్లు అంటూ ఆ మధ్య ప్రకటించి వరుసగా నాలుగైదు సినిమాలకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఆ నాలుగైదు సినిమాల్లో కనీసం ఒకటి రెండు కూడా పూర్తి చేస్తారా అంటే అనుమానమే అన్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Advertisement

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మరింత యాక్టివ్‌ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా యాత్రను నిర్వహించేందుకు ఇప్పటికే ముహూర్తాన్ని ఖరారు చేయడం జరిగింది. దసరా సందర్భంగా ప్రజల్లోకి వెళ్లేందుకు అధికారికంగా ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ కి సినిమాలు చేయడం ఇంట్రెస్ట్‌ లేదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయనతో సినిమా మొదలు పెట్టాలనుకున్న దర్శకుడు హరీష్ శంకర్ తో మరో సినిమా చేసే ప్రయత్నాల్లో బిజీ అయ్యాడు. మరోవైపు ఇటీవల కన్ఫర్మ్ అయిన రెండు సినిమాలు ఇప్పటికే సగం పూర్తయిన హరిహర వీరమల్లు సినిమాలు మధ్యలో ఉన్నాయి.

Pawan Kalyan Not Finished At least One Movie In Confirmed 2 Movies

Advertisement

ఆ సినిమాల పరిస్థితి ఏంటో ఏమీ అర్థం కావడం లేదు అంటూ నిర్మాతలు జుట్టు పీక్కుంటున్నారు. పవన్ కళ్యాణ్ ని గట్టిగా అడగలేని పరిస్థితి, ఆయన కూడా తాను సినిమాలు చేయను చేస్తాను అంటూ పరిస్థితి లేదు. దాంతో ఆయన తో సినిమాలు కమిట్ అయిన నిర్మాతలు దర్శకులు అటూ ఇటూ కాకుండా మధ్యలో ఉండి పోయారు. వారి కోసం సినిమాలను పూర్తి చేయడం లేదా సినిమాలను క్యాన్సల్ చేసుకోవడం చేయాలని పవన్ కళ్యాణ్ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ప్రజలలోకి వెళ్లి ఎందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఆయన యాత్ర నిర్వహిస్తే భారీ ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉంది, ఆ సమయంలో సినిమాలు చేయడమనేది అసాధ్యం. కనుక పూర్తిగా సినిమాలను వదిలేసి నట్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి