Home » Entertainment » Balakrishna And Anil Ravipudi Movie
Entertainment

BalaKrishna : బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమా ఏం జరుగుతోంది?

Authored By
aruna
The Telugu News | Updated on: August 11, 2022 2:09 pm
Advertisement

BalaKrishna : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిన సమయంలో టాలీవుడ్ నిర్మాతల సమ్మె కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పటికే సినిమా ను పూర్తి చేయాలని భావించినా నిర్మాతలు సమ్మె కారణంగా షూటింగ్ వాయిదా వేయడం జరిగింది. మరోవైపు బాలకృష్ణ తదుపరి సినిమాకు సంబందించిన చర్చలు జరుగుతున్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ సినిమా దాదాపు ఫైనల్ అయినట్లే అని అంతా భావించారు.

Advertisement

అధికారిక ప్రకటన కూడా వచ్చింది, కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి సినిమా అనుమానంగానే ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలా సినిమాలు ప్రకటన వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. వాటి దారిలోనే బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా కూడా క్యాన్సిల్ అవబోతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన నిర్మాత ఫిక్స్ అవ్వలేదు.

BalaKrishna And Anil Ravipudi Movie

Advertisement

అలాగే సినిమా స్టోరీ లైన్ కూడా ఇంకా అనిల్ రావిపూడి రెడీ చేయలేదని తెలుస్తోంది, కేవలం అనిల్ రావిపూడి పై ఉన్న నమ్మకంతో బాలకృష్ణ స్టోరీ లైన్ కూడా వినకుండా ఓకే చెప్పేశాడట. కానీ ఇప్పటి వరకు సరైన స్టోరీ రెడీ చేయడంలో విఫలమయ్యాడు అంటూ టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు కనుక సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనిల్ రావిపూడి కాంపౌండ్ నుండి మాత్రం బాలకృష్ణతో సినిమా ఉంటుంది అనే టాక్ వినిపిస్తుంది. అసలు విషయం ఏమిటో అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి