Hari Hara Veera Mallu : బాబోయ్.. వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ అంత రెమ్యునరేషన్ తీసుకున్నారా?
ప్రధానాంశాలు:
Hari Hara Veera Mallu : బాబోయ్.. వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ అంత రెమ్యునరేషన్ తీసుకున్నారా?
Hari Hara Veera Mallu : ఐదేళ్ల పాటు అనేక అవరోధాలను అధిగమించి, చివరకు జూలై 24న థియేటర్లలో సందడి చేసిన చిత్రం Hari Hara Veera Mallu Movie Review హరిహర వీరమల్లు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ nidhi agarwal హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, సత్యరాజ్, నోరా ఫతేహి, జిషు సేన్‌గుప్తా, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.

Hari Hara Veera Mallu : బాబోయ్.. వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ అంత రెమ్యునరేషన్ తీసుకున్నారా?
Hari Hara Veera Mallu పవన్ మంచి మనసు..
ఈ భారీ ప్రాజెక్టుకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, తరువాత జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం తన మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దాదాపు రూ. 250 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమాను నిర్మించారు. కోవిడ్, లాక్‌డౌన్, రాజకీయ షెడ్యూళ్లు వంటి అనేక కారణాల వల్ల సినిమా షూటింగ్‌లో అనేక జాప్యాలు జరిగాయి.ఈ ఆలస్యం వల్ల నిర్మాతపై ఆర్థికంగా భారం పడుతుందని భావించిన పవన్ కళ్యాణ్, తన అడ్వాన్స్ రెమ్యునరేషన్ రూ.11 కోట్లు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
“హరిహర వీరమల్లు కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడితే, అప్పుడే రెమ్యునరేషన్ గురించి ఆలోచిస్తాను.” అని పేర్కొన్నారు.”నిర్మాతకు నష్టం కాకూడదు” అనే దృక్పథంతో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీలో అరుదైనది. గతంలో బ్రో సినిమా కోసం రూ.50 కోట్లు పారితోషికంగా తీసుకున్న పవన్, ఈ సినిమా విషయంలో పూర్తి భిన్నంగా వ్యవహరించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.