Unstoppable 2 : చిరంజీవికి షాక్ ఇస్తూ.. పవన్ కళ్యాణ్ – బాలయ్య ఒకే స్టేజీ మీద .. ఇక నెక్స్ట్ లెవెల్ అరాచకం ఇది

 Authored By jagadesh | The Telugu News | Updated on :14 October 2022,8:00 pm

Unstoppable 2 : బాలయ్య బాబు అన్ స్టాపబుల్ షో ఎంత సూపర్ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఏ తెలుగు చానెల్ లో కానీ.. ఓటీటీలో కానీ సూపర్ సక్సెస్ అయిన షో లేదు. అన్ స్టాపబుల్ కేవలం బాలకృష్ణ హోస్టింగ్ వల్ల సూపర్ సక్సెస్ అయింది. దీంతో అదే ఊపుతూ  అన్ స్టాపబుల్ 2 షోను కూడా తీసుకొస్తున్నారు. అక్టోబర్ 14 నుంచి ఈ షో ప్రారంభం కానుంది. తొలి సీజన్ కంటే డబుల్ త్రిబుల్ ఉత్సాహంతో ఈసారి బాలకృష్ణ హోస్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే తొలి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వచ్చేసింది.

తొలి ఎపిసోడ్ ను చంద్రబాబు, నారా లోకేశ్ తో తీశారు. ఆ ప్రోమో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ అందరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఇక రెండో ఎపిసోడ్ ఎవరితోనో తెలుసా? ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో. అవును.. అది కూడా బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ అంటే.. ఇక ఆ ఎపిసోడ్ ఇంకెంత రంజుగా ఉంటుంది చెప్పండి. దానికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య బాబు అన్ స్టాపబుల్ షోకు రెండో ఎపిసోడ్ లో గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వచ్చినట్టు తాజా ఫోటో చూస్తేనే తెలుస్తోంది.

pawan kalyan to be in balakrishna unstoppable 2 show

pawan kalyan to be in balakrishna unstoppable 2 show

Unstoppable 2 : పవన్ చేతులు పట్టుకొని స్టేజి మీదికి తీసుకొచ్చిన బాలకృష్ణ

పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకొని మరీ బాలయ్య బాబు ప్రేక్షకులకు పవన్ నను పరిచయం చేయడం, ప్రేక్షకులకు అభివాదం చేయడం ఆ ఫోటోలో చూడొచ్చు. ఈ ఫోటో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని లేపుతోంది. అసలు.. పవన్ కళ్యాణ్ ఏంటి.. అన్ స్టాపబుల్ షోకు రావడం ఏంటంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ షో ఖచ్చితంగా ఆహా ఓటీటీలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని, తమ అభిమాన నటుడిని ఇలాగైనా చూసే అవకాశం దక్కుతోందని పవన్ అభిమానులు అనుకుంటున్నారు. చూద్దాం మరి.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో?

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి