
pawan kalyan to be in balakrishna unstoppable 2 show
Unstoppable 2 : బాలయ్య బాబు అన్ స్టాపబుల్ షో ఎంత సూపర్ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఏ తెలుగు చానెల్ లో కానీ.. ఓటీటీలో కానీ సూపర్ సక్సెస్ అయిన షో లేదు. అన్ స్టాపబుల్ కేవలం బాలకృష్ణ హోస్టింగ్ వల్ల సూపర్ సక్సెస్ అయింది. దీంతో అదే ఊపుతూ అన్ స్టాపబుల్ 2 షోను కూడా తీసుకొస్తున్నారు. అక్టోబర్ 14 నుంచి ఈ షో ప్రారంభం కానుంది. తొలి సీజన్ కంటే డబుల్ త్రిబుల్ ఉత్సాహంతో ఈసారి బాలకృష్ణ హోస్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే తొలి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వచ్చేసింది.
తొలి ఎపిసోడ్ ను చంద్రబాబు, నారా లోకేశ్ తో తీశారు. ఆ ప్రోమో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ అందరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఇక రెండో ఎపిసోడ్ ఎవరితోనో తెలుసా? ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో. అవును.. అది కూడా బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ అంటే.. ఇక ఆ ఎపిసోడ్ ఇంకెంత రంజుగా ఉంటుంది చెప్పండి. దానికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య బాబు అన్ స్టాపబుల్ షోకు రెండో ఎపిసోడ్ లో గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వచ్చినట్టు తాజా ఫోటో చూస్తేనే తెలుస్తోంది.
pawan kalyan to be in balakrishna unstoppable 2 show
పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకొని మరీ బాలయ్య బాబు ప్రేక్షకులకు పవన్ నను పరిచయం చేయడం, ప్రేక్షకులకు అభివాదం చేయడం ఆ ఫోటోలో చూడొచ్చు. ఈ ఫోటో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని లేపుతోంది. అసలు.. పవన్ కళ్యాణ్ ఏంటి.. అన్ స్టాపబుల్ షోకు రావడం ఏంటంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ షో ఖచ్చితంగా ఆహా ఓటీటీలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని, తమ అభిమాన నటుడిని ఇలాగైనా చూసే అవకాశం దక్కుతోందని పవన్ అభిమానులు అనుకుంటున్నారు. చూద్దాం మరి.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో?
School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…
Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్‌గా…
Mana Shankara Vara Prasad Garu Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…
Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…
Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…
Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…
Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…
Pushpa-3 : తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఒక్కటే పుష్ప–3 (Pushpa-3)ఉంటుందా? లేక ఇది…
This website uses cookies.