Payal Rajput : ప్రభాస్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా – హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..!

Authored By Anusha V | The Telugu News | Updated on: November 24, 2023, 8:34 pm
  •  Payal Rajput : ప్రభాస్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా -

  •   హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..!

  •  మంగళవారం  సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్

Payal Rajput : ఆర్ఎక్స్ 100  సినిమా RX 100 Movie తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్ పుత్ Payal Rajput తాజాగా  మంగళవారం  సినిమా Mangalavaaram Movie తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 17న విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా ప్రభాస్ పై పాయల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇప్పటికే చాలాసార్లు పాయల్ ప్రభాస్ Prabhas కి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో రోజా పువ్వును ఇవ్వాలనుకుంటే మీరు ఎవరికి ఇస్తారు అని యాంకర్ అడగగా పాయల్ సిగ్గుపడుతూ రోజా పువ్వును ఒకే ఒక్క వ్యక్తికి ప్రభాస్ కి మాత్రమే ఇస్తానని ఆమె చెప్పారు. తాజాగా మరోసారి ప్రభాస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సినిమాకి సపోర్ట్ చేసిన ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి చాలా థాంక్స్ అని పాయల్ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర అయినా ప్రియదర్శిని డైరెక్టర్ రివిల్ చేశారు. ఈ సినిమాలో చాలా ట్విస్ట్ లు ఉన్నాయి.

అందులో ప్రియదర్శి పాత్రను తాజాగా డైరెక్టర్ అజయ్ భూపతి రివీల్ చేశారు. ఈ సక్సెస్ మీట్ లో యంగ్ హీరో విశ్వక్సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పాల్గొన్నారు. ఇక ఈ సినిమాలో పాయల్ బోల్డ్ పాత్రలో నటించినప్పటికీ ఆమె పాత్ర పరంగా ఆమెపై సింపతి క్రియేట్ అయ్యేలా ఉండడంతో ఆమెపై నెగటివ్ కామెంట్స్ రాలేదు. ఆమె క్యారెక్టర్ సానుభూతి పొందేలా ఉందని చూసిన వాళ్ళు చెబుతున్నారు. దీంతో ఈ సినిమా ద్వారా పాయల్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఈ సినిమా తో రెండో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నారు.

Anusha V

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp