
Payal Rajput on Vijay Devarakonda And Prabhas
Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న బ్యూటీ. ఆర్ఎక్స్ 100 సినిమాలో ఇందుగా నటించి అందరి మతి పోగొట్టేసింది. అందాల ఆరబోతలో ఎలాంటి అడ్డూ లేదని చెప్పకనే చెప్పేసింది. పాయల్ అందాలకు తెలుగు ఆడియెన్స్ పిచ్చెక్కిపోయారు. అయితే మళ్లీ ఆ స్థాయి సినిమా ఆమె ఖాతాలో పడలేదు. ఆర్ఎక్స్ 100 లాంటి సినిమా పాయల్‌కు రాలేదు. అయితే వచ్చిన సినిమాల్లా చేసుకుంటూ పోతోంది. థియేటర్లో పాయల్ కనిపించి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఇక ఇప్పుడు తీస్ మార్ ఖాన్ అనే సినిమాతో పాయల్ రాబోతోంది ఆగస్ట్ 19న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఆది సాయి కుమార్ సరసన పాయల్ నటిస్తున్న ఈ మూవీ టీజర్, ట్రైలర్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక ఇందులో పాయల్ బీచ్ సాంగు, అందులో ఆమె అందాల ప్రదర్శన పీక్స్‌లో ఉంది.
మళ్లీ ఆర్ఎక్స్ 100 రోజుల్ని పాయల్ గుర్తు చేసేలా ఉంది. ఆ సినిమాలో ఇందు పాత్ర ఇచ్చినట్టుగానే ఇందులోనూ ఎన్నో ట్విస్టులున్నాయని, వాటికోసమైన మీరు సినిమాను చూడాల్సిందే అన్నట్టుగా పాయల్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది. అయితే ఈ క్రమంలోనే పాయల్ తన సినిమాను వెరైటీగా ప్రమోషన్ చేసుకుంది. పాయల్ తన అభిమానులతో లైవ్ చిట్ చాట్ పెట్టేసింది. ఈ క్రమంలో పాయల్‌ను నెటిజన్లు రకరకాల ప్రశ్నలు వేశారు. తీస్ మార్ ఖాన్ సినిమా గురించి అడిగేశారు. అంతే కాకుండా విజయ్ దేవరకొండ, ప్రభాస్ వంటి హీరోల గురించి కూడా పాయల్‌ను ప్రశ్నలు అడిగారు. ప్రభాస్‌తో మీరు ఎప్పుడు సినిమాను చేస్తారు? అని పాయల్‌ను ఓ నెటిజన్ అడిగాడు. నేను కూడా దాని కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను.. ప్రభాస్ సర్ దీనికి మీరే సమాధానం చెప్పాలి.. అంటూ ప్రభాస్‌ను ట్యాగ్ చేసింది పాయల్.
Payal Rajput on Vijay Devarakonda And Prabhas
ఇక విజయ్ దేవరకొండ గురించి చెప్పమని ఇంకో నెటిజన్ అడిగాడు. ప్రతీ అమ్మాయి కోరుకునే అబ్బాయి హీరో అంటూ ఇలా విజయ్ దేవరకొండ గురించి పాయల్ చెప్పుకొచ్చింది. మొత్తానికి పాయల్ మాత్రం తన సినిమాను ఇలా వీలైనంతగా ప్రమోట్ చేసుకుంటుంది. మరి ఈమె భవిష్యత్తు, సినిమా భవిష్యత్తు రేపు తేలుతుంది.
Payal Rajput on Vijay Devarakonda And Prabhas
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.