Perfume Movie : ‘పర్‌ఫ్యూమ్’ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి పెద్ద విజయాన్ని అందించాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆస్కార్ గ్రహీత చంద్రబోస్..!

Advertisement
Advertisement

Perfume Movie : స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌‌తో ఇంత వరకు ఏ సినిమా రాలేదు. అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో ‘పర్‌ఫ్యూమ్’ అనే చిత్రం రాబోతోంది. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించారు. జే.డి. స్వామి దర్శకత్వంలో తెరకకెక్కగా.. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా ఈ “పర్‌ఫ్యూమ్” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 24న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గురువారం నిర్వహించారు. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్‌ను చిత్రయూనిట్ ఘనంగా సత్కరించింది. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్ విష్ణుమూర్తి గారు, ఐఆర్ఎస్ మురళీ మోహన్ గారు, గ్రీన్ హార్స్ కంపెనీ అధినేతి ప్రవీణ్ రెడ్డి గారు, ఆచార్య భట్టు రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడింది.

Advertisement

హీరో చేనాగ్ మాట్లాడుతూ.. ‘రెండేళ్ల క్రితం జేడీ నాకు ఈ పర్‌ఫ్యూమ్ ఐడియా చెప్పారు. చాలా మంది దగ్గరకు వెళ్లాం. కానీ కొంత మందికి ఈ కథ అర్థం కాలేదు. చివరకు ఈ కారెక్టర్ నేనే చేశాను. రావూరి శ్రీనివాస్, శివ, సుధాకర్, రాజీవ్, రాజేంద్ర అన్న ఇలా అందరూ కలిసి నన్ను ముందుకు నడిపించారు. చంద్రబోస్ గారు ముందు నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుచిత్రా చంద్రబోస్ గారి సాయం ఎప్పటికీ మరిచిపోలేను. స్మెల్లింగ్ అబ్‌సెషన్‌తో కూడిన కథను ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదు. ఈ మూవీలో ఎన్నో లేయర్స్ ఉంటాయి. డార్క్ మోడ్‌లో నా కారెక్టర్ ఉంటుంది. నాకు మళ్లీ ఇలాంటి ఒక మంచి కారెక్టర్ దొరకదు. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ స్వామికి థాంక్స్. నవంబర్ 24న చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

Advertisement

ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు 3700 పాటలు రాశాను. ఈ రోజు నా గురించి, నా మీద పాట రాశారు, పాడారు. నాకు బహుమతిగా ఆ పాటను ఇచ్చిన టీంకు థాంక్స్. ఆస్కార్ వచ్చిన ఆ మూమెంట్‌ను మళ్లీ చూడటంతో ఎమోషనల్ అయ్యాను. జేడీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నేను రాసిన పాటకు ఎంతో చక్కటి బాణీలను అజయ్ అందించారు. కెమెరామెన్ అద్భుతంగా తీశారు. జేడీ మనసును దర్శించిన నేత్రమే కెమెరామెన్. ఇందులో ఓ పాటకు కొరియోగ్రఫీ చేసిన నా సతీమణి సుచిత్రకు ఆల్ ది బెస్ట్. ఆచార్య ఆత్రేయ పాటలు, శైలి, రీతి, ప్రవర్తనే నా జీవితంలో పరిమళం. దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఆదరించి పెద్ద విజయాన్ని అందించాలి’ అని అన్నారు.

అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘నేను చేసిన సినిమాకు నగేష్ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. నేను ఒక సినిమా చేశాను.. గెస్టుగా రమ్మని అడిగారు. ఆయనకెన్నో క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను. చిత్రయూనిట్ కి ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.డైరెక్టర్ జే.డి. స్వామి మాట్లాడుతూ.. ‘కొత్తదనం, కొత్త పాయింట్‌తో సినిమా చేస్తే కచ్చితంగా మంచి ప్రతిఫలం వస్తుంది. ఆ సుగంధం కచ్చితంగా వ్యాపిస్తుంది. నా గురువు చంద్రబోస్ గారే నాకు స్పూర్తి. నవంబర్ 24న మా చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో మాట్లాడుతూ.. ‘పర్‌ఫ్యూమ్ టీంకు ఆల్ ది బెస్ట్. నవంబర్ 24న థియేటర్లోకి రాబోతోంది. చంద్రబోస్ గారే మాకు స్పూర్తి. ఆయనే ఈ సినిమాకు పెద్ద దిక్కయ్యారు. నా జీవితంలో పాటే పర్‌ఫ్యూమ్. ఆ పాట వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను’ అని అన్నారు.

హీరోయిన్ ప్రాచీ థాకర్ మాట్లాడుతూ.. ‘మూవీలో లీలా అనే పాత్రలో నటించాను. థ్రిల్లర్, లవ్ స్టోరీలో నటించాను. ఇలాంటి జానర్‌లో సినిమా రావడం ఇదే మొదటి సారి. ఎంతో కొత్తగా ఉంటుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ మాట్లాడుతూ.. ‘చంద్రబోస్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా టీం అంతా కూడా నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్ గారి పాటలు వినే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను’ అని అన్నారు.కెమెరామెన్ మహేష్ మాట్లాడుతూ.. ‘నాగేశ్వర్ నాకు స్నేహితుడు. నా మిత్రుడి కోసం ఈ చిత్రానికి పని చేయాలని అనుకున్నాను. ఈ మూవీకి పని చేయడం ఆనందంగా ఉంది. చంద్రబోస్ సాహిత్యం, అజయ్ సంగీతం బాగుంటుంది. ఈ సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Advertisement

Recent Posts

Passports : ప్రపంచంలోనే టాప్ 5 ఖ‌రీదైన‌, చ‌వ‌కైన పాస్‌పోర్ట్‌లు.. మ‌రి భారతీయ పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…

8 hours ago

Mahakumbh Mela : జ‌న‌వ‌రి 13 నుంచి మహాకుంభమేళా.. ఈ సారి త‌ప్పిపోతామ‌న్న భ‌యం లేదు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ఏఐ వినియోగం

Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…

10 hours ago

Ola Electric : న‌ష్టాల బాట‌లో ఓలా ఎల‌క్ట్రిక్‌.. 500 ఉద్యోగుల‌కు ఉద్వాస‌న !

Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…

11 hours ago

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

12 hours ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

13 hours ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

14 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

15 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

15 hours ago

This website uses cookies.