pilot pradeep krishnan
pilot pradeep krishnan : పిల్లలు పుట్టగానే కాదు వారు ప్రయోజకులైతే పెద్దలు ఎంతో సంతోషిస్తారు. ఇంట్లో చేతికొచ్చిన యువకుడు అంటే అతను పెరిగి పెద్దగై మంచి ప్రయోజకుడు కావాలని ఎంతో ఆశపడతారు. అయితే వారి కోరిక నెరవేరి తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఆ సంతోషం వేరే లెవల్ అని చెప్పాలి. తాజాగా ఓ పైలెట్ తన తాత, నానమ్మని ఫ్లైట్ ఎక్కించుకొని వారిని చాలా సంతోషపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది . చిన్నతనంలో తనను తాత టీవీఎస్‌పై తిప్పగా.. ఇప్పుడు ఆ తాతను మనవడు విమానంలో తీసుకెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడుకు చెందిన ప్రదీప్ కృష్ణన్ అనే ఓ పైలట్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
pilot pradeep krishnan
చెన్నై నుంచి కోయంబత్తూర్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో పైలట్ అయిన ప్రదీప్ కృష్ణన్.. విమానం చెన్నై నుంచి బయల్దేరే ముందు ఒక అనౌన్స్‌మెంట్ చేశాడు. ప్రయాణికులకు ఒక ముఖ్య విషయం అని చెబుతూ ఈ విమానంలో తనతోపాటు తన కుటుంబ సభ్యులు కూడా ప్రయాణిస్తున్నారని అన్నాడు. తన తాతతో తొలిసారి విమానంలో ప్రయాణిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. నా తాత, నానమ్మ, అమ్మ ఈ విమానంలోని 29 వ వరుసలో కూర్చున్నారు. వారు తొలిసారి నాతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్నారు. నా చిన్నతనంలో మా తాత టీవీఎస్50 బండిపై ఎన్నోసార్లు నన్ను వెనక కూర్చోపెట్టి తిప్పాడు. ఇప్పుడు నాకు ఆ సమయం వచ్చింది. తాతను విమానంలో తిప్పే అవకాశం వచ్చింది అంటూ ప్రదీప్ కృష్ణన్ తమిళ్, ఇంగ్లీష్ కలిపి మాట్లాడాడు.
కొడుకు తమ గురించి చెబుతున్న సమయంలో ప్రదీప్ తల్లి భావోద్వేగంతో కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఇక తల్లి, తాత, బామ్మను ప్రదీప్ ప్రయాణికులకు పరిచయం చేయడంతో అందరు కరతాళ ధ్వనులతో అభినందించారు. ఇక వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుటుంబసభ్యులు, స్నేహితులతో విమానంలో ప్రయాణించాలని ప్రతీ పైలట్‌కు ఒక కల అని అన్నాడు.. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రదీప్ కృష్ణన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక గతంలో 2018 లో తన తల్లి, నానమ్మను తొలిసారి విమానంలో తీసుకెళ్లి అప్పుడు కూడా అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశాడు ప్రదీప్
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
This website uses cookies.