pilot pradeep krishnan : హార్ట్ టచింగ్.. స్కూటర్‌పై తిప్పిన తాతని పైలట్‌గా విమానంలో తీసుకెళ్లిన మనవడు..
ప్రధానాంశాలు:
pilot pradeep krishnan : హార్ట్ టచింగ్.. స్కూటర్‌పై తిప్పిన తాతని పైలట్‌గా విమానంలో తీసుకెళ్లిన మనవడు..
pilot pradeep krishnan : పిల్లలు పుట్టగానే కాదు వారు ప్రయోజకులైతే పెద్దలు ఎంతో సంతోషిస్తారు. ఇంట్లో చేతికొచ్చిన యువకుడు అంటే అతను పెరిగి పెద్దగై మంచి ప్రయోజకుడు కావాలని ఎంతో ఆశపడతారు.
చెన్నై నుంచి కోయంబత్తూర్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో పైలట్ అయిన ప్రదీప్ కృష్ణన్.. విమానం చెన్నై నుంచి బయల్దేరే ముందు ఒక అనౌన్స్‌మెంట్ చేశాడు.
pilot pradeep krishnan : పిల్లలు పుట్టగానే కాదు వారు ప్రయోజకులైతే పెద్దలు ఎంతో సంతోషిస్తారు. ఇంట్లో చేతికొచ్చిన యువకుడు అంటే అతను పెరిగి పెద్దగై మంచి ప్రయోజకుడు కావాలని ఎంతో ఆశపడతారు. అయితే వారి కోరిక నెరవేరి తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఆ సంతోషం వేరే లెవల్ అని చెప్పాలి. తాజాగా ఓ పైలెట్ తన తాత, నానమ్మని ఫ్లైట్ ఎక్కించుకొని వారిని చాలా సంతోషపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది . చిన్నతనంలో తనను తాత టీవీఎస్‌పై తిప్పగా.. ఇప్పుడు ఆ తాతను మనవడు విమానంలో తీసుకెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడుకు చెందిన ప్రదీప్ కృష్ణన్ అనే ఓ పైలట్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
pilot pradeep krishnan గుండెలు పిండేలా చేసిన పైలెట్…
చెన్నై నుంచి కోయంబత్తూర్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో పైలట్ అయిన ప్రదీప్ కృష్ణన్.. విమానం చెన్నై నుంచి బయల్దేరే ముందు ఒక అనౌన్స్‌మెంట్ చేశాడు. ప్రయాణికులకు ఒక ముఖ్య విషయం అని చెబుతూ ఈ విమానంలో తనతోపాటు తన కుటుంబ సభ్యులు కూడా ప్రయాణిస్తున్నారని అన్నాడు. తన తాతతో తొలిసారి విమానంలో ప్రయాణిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. నా తాత, నానమ్మ, అమ్మ ఈ విమానంలోని 29 వ వరుసలో కూర్చున్నారు. వారు తొలిసారి నాతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్నారు. నా చిన్నతనంలో మా తాత టీవీఎస్50 బండిపై ఎన్నోసార్లు నన్ను వెనక కూర్చోపెట్టి తిప్పాడు. ఇప్పుడు నాకు ఆ సమయం వచ్చింది. తాతను విమానంలో తిప్పే అవకాశం వచ్చింది అంటూ ప్రదీప్ కృష్ణన్ తమిళ్, ఇంగ్లీష్ కలిపి మాట్లాడాడు.
కొడుకు తమ గురించి చెబుతున్న సమయంలో ప్రదీప్ తల్లి భావోద్వేగంతో కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఇక తల్లి, తాత, బామ్మను ప్రదీప్ ప్రయాణికులకు పరిచయం చేయడంతో అందరు కరతాళ ధ్వనులతో అభినందించారు. ఇక వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుటుంబసభ్యులు, స్నేహితులతో విమానంలో ప్రయాణించాలని ప్రతీ పైలట్‌కు ఒక కల అని అన్నాడు.. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రదీప్ కృష్ణన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక గతంలో 2018 లో తన తల్లి, నానమ్మను తొలిసారి విమానంలో తీసుకెళ్లి అప్పుడు కూడా అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశాడు ప్రదీప్
మొదటి సారి పేరెంట్స్‌ని ఫ్లైట్ ఎక్కించిన పైలట్..ఆనందంతో తల్లి కంటతడి
చెన్నై- కోయంబత్తూరు విమానంలో ప్రదీప్ అనే పైలట్ తన తల్లి, బామ్మ, తాతను మొదటి సారి విమానం ఎక్కించి సర్ప్రైజ్ చేశాడు.
మావాళ్లు నాతో మొదటిసారి విమానంలో ప్రయాణిస్తున్నారు. తాత చిన్నప్పుడు స్కూటర్ పై నన్ను… pic.twitter.com/tmjeqKHzA8
— Telugu Scribe (@TeluguScribe) April 6, 2024