Home » Entertainment » Pinky Emotional In Bigg Boss 6 Telugu
Entertainment

Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్‌లో ఎమోషనల్ అటాచ్‌మెంట్.. తన ప్రాబ్లమ్ చెప్పి అందర్నీ ఏడిపించిన పింకీ..

Authored By
mallesh
The Telugu News | Published on: September 17, 2022, 11:30 am
Advertisement

Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్ సీజన్-6 షో సోసోగా సాగుతోంది. ఇందులో పెద్దగా తెలిసిన మొహాలు లేకపోవడంతో వీక్షకుల సంఖ్య కూడా రోజురోజుకూ క్రమంగా తగ్గుతూ వస్తోందని తెలుస్తోంది. దీని రేటింగ్స్ కూడా దారుణంగా పడిపోయానని వార్తలు వస్తున్నాయి. దీంతో ఎలాగైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా ఎపిసోడ్‌లో ఎమోషనల్ అటాచ్ మెంట్ ఏర్పడింది. బుల్లితెర నటి సుదీపా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. నువ్వు నాకు నచ్చావు సినిమాలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలి పాత్ర చేసిన పింకీ అలియాస్ సుదీపా అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపడతారు.

Advertisement

ప్రస్తుతం ఈ నటి బిగ్‌బాస్ సీజన్ -6లో కంటెస్టెంట్‌గా చేస్తోంది. విక్టరీ వెంకీతో పింకీ చసే కామెడీని ఇప్పటికీ చాలా మంది గుర్తుపెట్టుకునే ఉంటారు. కామెడీ ఎంటర్ టైనర్‌గా వచ్చిన ఆ మూవీ వెంకటేశ్ కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా పింకీ తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయి చాలా ఏడ్చేసింది.అందర్నీ ఏడిపించింది. ‘నా లైఫ్‌లో అన్ని అనుకున్నట్టు జరిగాయి.ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నాను. ఫైనాన్షియల్‌‌గా బాగుంది. సినిమా ఆఫర్లు వచ్చాయి. 2015లో ఒకసారి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడే ఆస్ట్రేలియా టూర్‌ ఆఫర్‌ కూడా వచ్చింది.నేను ఇంకా తల్లిగా రెడీ కాలేదు అనుకున్నాను. అందుకే అబార్షన్ చేసుకున్నాను.

Pinky Emotional in Bigg Boss 6 Telugu

Advertisement

Bigg Boss 6 Telugu : పిల్లలు పుట్టడం లేదని బాధపడిన సుదీపా..

ఆ తర్వాత నా లైఫ్‌లో బిజీ అయిపోయాను. పిల్లలు ఎప్పుడు అని అందరూ అడగడం ప్రారంభించారు. 2018లో మరోసారి నేను ప్రెగ్నెంట్‌ అయ్యాను. అప్పుడు కూడా పిల్లలు కావాలని కూడా అనుకోలేదు. కానీ, ఈసారి దేవుడు ఇచ్చాడు.ఎందుకు మళ్లీ కాదనుకోవడం అని ఉంచుకున్నాను. రెండో నెల నుంచి బేబీకి మాకు అటాచ్‌ మెంట్ పెరిగింది.కానీ నాకు థైరాయిడ్‌ ఎక్కువైపోయి మళ్లీ అబార్షన్‌ అయిపోయింది.దీంతో నేను మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యాను. నా చెల్లెలికి కూతురి పుట్టగా తనతో బాండింగ్ పెరిగిపోయింది.ఎంతైనా తను నా చెల్లెలి కూతురు.. ఎప్పటికైనా వెళ్లిపోతుందని నా భర్త చెప్పడంతో ఏం చేయాలో తోచలేదు’ అని బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఏడిపించేసింది పింకీ..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి