
Karthika Deepam-2 Serial : దశరథ్‌పై దీప కాల్పులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
Karthika Deepam-2 Serial : తనపై జ్యోత్స్న వేసిన నిందలను ఆధారాలతో నిరూపించాలనుకుంటుది దీప. కానీ జ్యోత్స్న తెలివిగా వేసిన ప్లాన్‌తో దీప అడ్డంగా బుక్కవుతుంది. జ్యోత్స్న దీపను గన్‌తో బెదిరిస్తుంది. అయితే ఆమె చేతుల్లోంచి దీప గన్ లాక్కుని జ్యోత్స్నకే గురిపెడుతుంది. అయితే పొరపాటున గన్ పేలి బుల్లెట్ దశరథ్‌కు తాకడంతో అతడు కుప్పకూలిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ ఆ సీన్ చూసి షాక్‌కు గురైతాడు. మా బావను దీప షూట్ చేసిందని కార్తీక్‌తో జ్యోత్స్న చెబుతుంది. దశరథ్‌ను మావయ్య అని పిలుస్తూ దగ్గరకు వెళ్లేందుకు చూడగా ఎవర్రా నీకు మావయ్య అంటూ శివన్నారాయణ కార్తీక్‌ను నెట్టేస్తాడు. నువ్వు నా కొడుకును ముట్టుకోవద్దంటూ కార్తీక్, దీపలకు వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ.
Karthika Deepam-2 Serial : దశరథ్‌పై దీప కాల్పులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
షాక్ నుంచి తేరుకున్న దీప.. దశరథ్ దగ్గరకు వచ్చి అతడిపై చేయి వేసి పిలుస్తుంది. నా భర్తను వదిలిపెట్టు, నువ్వు అసలు మనిషివే కాదని సుమిత్ర కోపంగా అరుస్తుంది. అప్పుడే అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. దీపనే దశరథ్‌ను గన్‌తో షూట్ చేసిందని, తనను అరెస్ట్ చేయమని అక్కడే ఉన్న పారిజాతం అంటుంది. దీపనే హంతకురాలు, ఈ గన్‌తోనే దశరథ్‌ను చంపాలని చూసిందని ఎస్ఐతో శివన్నారాయణ చెప్పడంతో పోలీసులు దీపను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తారు.
కూరగాయలు తరుగుతూ వేలు కట్ చేసుకుంటుంది స్వప్న. దాంతో కాశీ కంగారు పడుతూ గాయాన్ని పట్టించుకోకుండా మొండిదానిలా మారిపోతున్నావని స్వప్నతో అంటాడు కాశీ. గాయాన్ని పట్టించుకోకుండా స్వప్న బదులిస్తూ ఇలా అంటుంది. దీప చాలా మంచిది, కానీ కోపం వస్తే అవతలి వాళ్లు ఏ స్థాయిలో ఉన్న వారిని చావగొడుతుంది. దానికి కాశీ మాట్లాడుతూ.. శౌర్య, కార్తీక్‌ను ఎవరేమన్నా దీప తట్టుకోలేదు. మనం అందరం ఒకే ఇంట్లో ఉంటే బాగుంటుందని స్వప్నతో కాశీ. కార్తీక్, దీపలతో కలిసి ఈ ఆదివారం డిన్నర్ ప్లాన్ చేద్దామని అంటాడు.
శౌర్య స్కూల్ నుంచి వచ్చేసరికి కాంచన కిందపడిపోయి కనిపిస్తుంది. స్పృహలో ఉండదు. శౌర్య, అనసూయ కంగారు పడతారు. అమ్మనాన్నలకు ఫోన్ చేసి విషయం చెబుతానని శౌర్య అంటుంది. ఆమెను అనసూయ ఆపేస్తుంది. మనవాళ్లకు ఏదో అయినట్లు గుండె దడగా అనిపించి కళ్లు తిరిగి పడిపోయానని కాంచన అంటుంది.
తాను దశరథ్‌ను కాల్చలేదని పోలీసులకు చెబుతుంది దీప. నువ్వు నేరం చేశావు అనడానికి సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి. నిన్ను ఎవరూ కాపాడలేరని ఎస్ఐ అంటాడు. అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు. నేను ఎవరిని కాల్చలేదని, ఆ గన్ ఎలా పేలిందో కూడా తనకు తెలియదని కార్తీక్‌తో అంటుంది దీప. గన్ పట్టుకోవడం ఇదే మొదటిసారి అని చెబుతుంది. మొదటిసారి అయినా గురి తప్పకుండా గుండెలపై కాల్చావని ఎస్ఐ అంటాడు. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడొద్దు పోలీస్ ఆఫీసర్‌పై కార్తీక్ ఫైర్ అవుతాడు. దశరథ్ తనకు మావయ్య అని కార్తీక్ అంటాడు. ఆస్తి గొడవల వల్లే మీ మావయ్యపై దీప ప్రతీకారం తీర్చుకుందా, అందుకే ఆయన్ని చంపాలని అనుకుందా అంటూ ఎస్ఐ ప్రశ్నిస్తాడు. గన్‌పై దీప వేలి ముద్రలు తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, దీపపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని, కోర్టుకు పంపిస్తామని అంటాడు. శిక్ష ఎవరికి వేయాలన్నది కోర్టు డిసైడ్ చేస్తుందని కార్తీక్‌తో చెబుతాడు ఎస్ఐ. అయితే తన చేతిలో గన్ పేలలేదని, ఎవరు కాల్చారో తనకు తెలియదని దీప అంటుంది.
డాక్టర్లు దశరథ్‌కు సర్జరీ చేసి బుల్లెట్ బయటకు తీస్తారు. కొడుకు పరిస్థితి చూసి శివన్నారాయణ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడే హాప్పిటల్‌కు కార్తీక్ వస్తాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగుస్తుంది.
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం…
Perni Nani : గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు మళ్లీ నోటికి పనిచెపుతున్నారు. సీఎం…
School Holidays: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక మహోత్సవంగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సమయం ఆసన్నమైంది. జనవరి 28…
Gold Rate Today on Jan 28th 2026 : గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు పెరగడమే తప్ప…
Brahmamudi Today Episode: బ్రహ్మముడి సీరియల్ 941వ ఎపిసోడ్ ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేసేలా సాగింది. కావ్య–ధర్మేంద్ర ట్రాక్‌లో కీలక మలుపులు…
This website uses cookies.