Pooja Hegde : త‌డిసిన అందాల‌తో హొయ‌లు పోతున్న పూజాహెగ్ధే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pooja Hegde : త‌డిసిన అందాల‌తో హొయ‌లు పోతున్న పూజాహెగ్ధే..

 Authored By mallesh | The Telugu News | Updated on :15 November 2021,2:55 pm

Pooja Hegde: బుట్టబొమ్మ ‘పూజా హెగ్డే’గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ సుందరి తెలుగులో ‘ఒక లైలా కోసం’మూవీలో అక్కినేని నట వారసుడు ‘నాగ చైతన్య’కు జోడిగా నటించిన విషయం తెలిసిందే. తొలి సినిమాతో ఈ అమ్మడుకు మంచి పేరు వచ్చినా బాక్సీఫీసు వద్ద ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో వచ్చిన ‘ముకుంద’లో గ్లామర్ రోల్ చేసిన పొడుగు కాళ్ల సుందరి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

పూజా నటించిన సినిమాలకు వరుసగా నెగెటివ్ టాక్ రావడంతో ‘ఐరన్ లెగ్’అని పేరు తెచ్చుకుంది ఈ సుందరి.ఆ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవిందసమేత వీరరాఘవ’, ‘అల వైకుంఠపురము’లో మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన ఈ సెక్సీ సుందరి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘బుట్టబొమ్మ’సాంగ్‌లో బన్నీతో కలిసి పూజా వేసిన స్టెప్పులకు పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ వచ్చేసింది.

pooja hegde beautiful pics

pooja hegde beautiful pics

Pooja Hegde  బుట్టబొమ్మ అందాలు అన్నీ ఇన్నీ కావు..

ఈ మధ్యే అక్కినేని అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ క్యూట్ అండ్ హాట్ భామ్.ఇకపోతే పూజా సినిమా సినిమాకు ఏ మాత్రం గ్యాప్ దొరికిన తెగ ఏంజాయ్ చేస్తుంటుంది. ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్స్ ప్లాన్ చేస్తుంటుంది. తాజాగా బీచ్ లో మునిగి తేలుతూ బికినీతో తన అందాలను ఆరబోసింది. బ్రౌన్ కలర్ బికినీ వేసుకుని చేతిలో గ్లాసు పట్టుకుని ఫోటోకు ఫోజులిచ్చింది.

బీచ్‌లో ఎంజాయ్ అనంతరం అలసిపోతే ఎనర్జీకోసం డ్రిక్స్, సీ ఫుడ్, ప్రూట్స్‌ను కూడా పక్కనే పెట్టుకుంది. ప్లేన్ అండ్ బ్లూ బ్యాక్ గ్రౌండ్‌లో కత్తిలాంటి చూపులతో మత్తెక్కిస్తోంది బుట్టబొమ్మ.. ఈ పిక్‌ను చూసిన వాళ్లు వెకేషన్ ఎలా ఎంజాయ్ చేయాలో పూజా డెమో ఇచ్చిందని మాట్లాడుకుంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది