Pooja hegde completes radhe shyam Teaser Dubbing
Pooja hegde : ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా అప్డేట్ కోసం జనాలు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. రాధేశ్యామ్ అప్డేట్ల విషయంలో యూవీ క్రియేషన్స్‌ను ప్రభాస్ అభిమానులు ఎంతలా ఆడుకున్నారు.. ఎంతగా ట్రోల్ చేశారో అందరికీ తెలిసిందే. అయితే ఎట్టకేలకు రాధేశ్యామ్ నుంచి ఓ అప్డేట్ రాబోతోంది. సంక్రాంతి సీజన్‌లో అందరూ అప్డేట్‌లు ఇచ్చారు. కానీ రాధేశ్యామ్ యూనిట్ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయింది.
Pooja hegde completes radhe shyam Teaser Dubbing
జనవరి చివరి వారంలో దాదాలు టాలీవుడ్ చిత్రాలన్నీ కూడా అప్డేట్ల జాతరను చేపట్టింది. ప్రతీ ఒక్క సినిమా యూనిట్ తమకు సంబంధించిన అప్డేట్లను ప్రకటించారు. కానీ అప్పుడు కూడా యూవీ క్రియేషన్స్ గమ్మునే ఉంది. ఇక ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. అలా రాధేశ్యామ్ యూనిట్ వాలెంటైన్స్ డేకు ఓ స్పెషల్ అప్డేట్ ఉంటుందని ప్రకటించారు. ఫిబ్రవరి 14న టీజర్ రాబోతోందని ప్రకటించారు.
ప్రేమికుల రోజున టీజర్ వస్తుందని చెబుతూ ప్రభాస్ అలా స్టైలీష్‌గా ఏదో ఫీలవుతున్నట్టు నడిచి వస్తున్న వీడియో వదిలారు. అది ఓ రేంజ్‌లో వైరల్ అయింది. అయితే తాజాగా ఈ టీజర్‌కు సంబంధించిన డబ్బింగ్ పూర్తయిందంటూ పూజా హెగ్డే ఓ పోస్ట్ చేసింది. ఇక ఫిబ్రవరి 14న కలుస్తామంటూ డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పింది. పూజా హెగ్డే ప్రస్తుతం రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చిత్రాలతోనే బిజీగా ఉంది.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.