Is kcr already know about ys sharmila new party
kcr : గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారం నిజం అయ్యింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రెడ్డి తెలంగాణలో జెండా ఎగురవేసేందుకు సిద్దం అయ్యారు. తెలంగాణలో షర్మిల వైకాపా పగ్గాలు చేత పట్టాలని చాలా మంది చాలా కాలంగా కోరుకుంటున్నారు. కాని వైకాపాకు తెలంగాణలో ఛాన్స్ లేవని ఇప్పటికే తేలిపోయింది. కనుక తెలంగాణ లో కొత్తగా పార్టీ పెడితేనే అంతో ఇంతో ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు షర్మిలకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇంకా తెలంగాణలో ఉన్న రాజన్న అభిమానులు మరియు కొందరు సానుభూతి పరులతో మాట్లాడి షర్మిల నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తాజా సమావేశంలో చెప్పుకొచ్చింది.
Is kcr already know about ys sharmila new party
ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ ముఖ్యమంత్రి మార్పు విషయమై క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడిన మరో మాట ఫోకస్ లోకి రాలేదు. ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా ప్రాంతీయ పార్టీలు పెట్టడం వల్ల ప్రయోజనం శూన్యం. తెలుగు దేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు మినహా మరే పార్టీకి కూడా అవకాశంను ప్రజలు ఇవ్వలేదు. కనుక ఇప్పుడు కొత్త పార్టీ వచ్చినంత మాత్రాన ఎవరు ఏం చేయరు అన్నట్లుగా కేసీఆర్ మాట్లాడాడు. ఆ మాటలు మొదట కొందరు ఈటెలను ఉద్దేశించి అన్నాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కాని తాజాగా షర్మిల పార్టీని ప్రకటించే అవకాశం ఉందని తేలిపోయిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు షర్మిల ప్రాంతీయ పార్టీని ఉద్దేశించి అంటూ తేలిపోయింది.
షర్మిల పార్టీ గురించే మొన్న కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేశాడు అనేది అందరు అంటున్న మాట. అయితే ఒక వైపు షర్మిల పార్టీకి అంత సీన్ లేదు అంటూనే మరో వైపు ఆమెకు మద్దతు ఇస్తున్నదే స్వయంగా టీఆర్‌ఎస్ అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ మరియు బీజేపీ ఓట్లను చీల్చేందుకు కేసీఆర్ వేసిన ఎత్తుగడ ఇందుకు జగన్ మరియు షర్మిలలు సహకరిస్తున్నారు అంటూ ఈ సందర్బంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు షర్మిల పార్టీని ఒక స్థాయి వరకే ఉంచడంతో పాటు మరో వైపు ప్రత్యర్థి పార్టీల ఓట్లను చీల్చేందుకు ప్రయత్నాలు చేయడం ఇక్కడ గమనించవచ్చు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.