Home » Entertainment » Pooja Hegde Exitement About Radhe Shyam
Entertainment

Radhe Shyam : రాధే శ్యామ్ రిలీజ్‌పై ఎగ్జైట్ అవుతున్న పూజా హెగ్డే..తెగ మెరిసిపోతుందిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 10, 2022, 2:30 pm
Advertisement

Pooja Hegde: ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒక‌రు. తెలుగు హీరో నాగచైతన్యతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వ‌రుస సినిమాలు చేస్తూ సంద‌డి చేస్తుంది. తెలుగు, త‌మిళం,హిందీ భాష‌ల‌లో సినిమాలు చేస్తూ అల‌రిస్తున్న పూజా హెగ్డే రాధే శ్యామ్ చిత్రంతో ప‌ల‌క‌రించనుంది. సినిమా రిలీజ్‌కి మ‌రో రోజు మాత్ర‌మే ఉండ‌డంతో చాలా ఎగ్జైట్ ఫీల‌వుతుంది. థియేట‌ర్‌లో సినిమా చూస్తూ ఫుల్ ఖుష్ అవుతున్న పూజా హెగ్డేని చూసి మైమ‌ర‌చిపోతున్నారు. పూజా హెగ్డేకి ఈ సినిమా కూడా హిట్ ప‌డితే మాత్రం తిరుగుండ‌దు అనే చెప్పాలి.

Advertisement

డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్ . ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానరపై భారీ బడ్జెట్‏తో వంశీ ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.గ‌త కొద్ది రోజులుగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న పూజా హెగ్డే .. ప్రభాస్‏తో తనకు మధ్య ఏర్పడ్డ మనస్పర్థల గురించి స్పందించింది.

pooja hegde exitement about Radhe Shyam

Advertisement

Pooja Hegde : పూజా ఎగ్జైట్‌మెంట్‌..

రాధేశ్యామ్ షూటింగ్ సమయంలో ప్రభాస్.. పూజా హెగ్డే మధ్య గొడవలు జరిగాయని.. దీంతో వారిద్దరూ మాట్లాడుకోవడం లేదని వార్తలు వినిపించాయి. పూజా హెగ్డే షూటింగ్ సమయంలో ప్రవర్తించిన తీరుతో చిత్రయూనిట్ అనేక ఇబ్బందులు ఎదుర్కోందని.. దీంతో ప్రభాస్ ఆమెపై సీరియస్ అయినట్లుగా గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అవన్ని రూమర్స్ మాత్రమే అంటూ యూవీ క్రియేషన్స్ కొట్టిపాడేసింది. దీనిపై పూజా కూడా స్పందించింది.షూటింగ్ సమయంలో ప్రభాస్ తో తనకు మనస్పర్థలు వచ్చినట్టు వస్తున్న వార్తలలో నిజం లేదని.. మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉన్నామని.. ప్రభాస్ తనకోసం చాలాసార్లు స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ తీసుకువచ్చారని తెలిపింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి