Pooja Hegde : లైట్ గ్రీన్ లెహంగాలో మ‌త్తెక్కిస్తున్న‌ పూజా హెగ్డే.. ఈ బ్యూటీకి దాసోహం అంటున్న నెటిజ‌న్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pooja Hegde : లైట్ గ్రీన్ లెహంగాలో మ‌త్తెక్కిస్తున్న‌ పూజా హెగ్డే.. ఈ బ్యూటీకి దాసోహం అంటున్న నెటిజ‌న్స్

Pooja Hegde : బుట్ట‌బొమ్మ‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. గత మూడేళ్ళుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది పూజా. కేవలం హీరోయిన్ కాకుండా.. ఐటెం సాంగ్స్‌లో మెరుస్తోంది. అరవింద స‌మేత చిత్రం త‌ర్వాత పూజా హెగ్డే.. వ‌రుస విజ‌యాలు సాధించింది. ప్రభాస్‌ రాధేశ్యామ్ మొదలుకొని ఆ తర్వాత వచ్చిన బీస్ట్, తాజాగా ఆచార్య హ్యాట్రిక్ ఫ్లాప్స్‌తో పూజా హెగ్డే నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. దాంతో ఈ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :25 October 2022,6:00 pm

Pooja Hegde : బుట్ట‌బొమ్మ‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. గత మూడేళ్ళుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది పూజా. కేవలం హీరోయిన్ కాకుండా.. ఐటెం సాంగ్స్‌లో మెరుస్తోంది. అరవింద స‌మేత చిత్రం త‌ర్వాత పూజా హెగ్డే.. వ‌రుస విజ‌యాలు సాధించింది. ప్రభాస్‌ రాధేశ్యామ్ మొదలుకొని ఆ తర్వాత వచ్చిన బీస్ట్, తాజాగా ఆచార్య హ్యాట్రిక్ ఫ్లాప్స్‌తో పూజా హెగ్డే నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. దాంతో ఈ హీరోయిన్‌కి ఆఫర్లు తగ్గాయి. ఫ్లాపులను దృష్టిలో ఉంచుకొని సెలక్టివ్‌గా సినిమాలు సైన్ చేస్తోందట.

హాట్రిక్స్ ఫ్లాప్స్ వచ్చినా.. అవన్ని హీరో బేస్డ్ మూవీస్ కావడంతో కథానాయికగా పూజా హెగ్డేకు పోయిందేమి లేదంటున్నారు ఆమె అభిమానులు. ఏమైనా సినీ ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్స్ ఆధారంగానే హీరోయిన్స్ కెరీర్ నిర్ణయమవుతోంది.ఇప్పుడు ఈ అమ్మ‌డు బాలీవుడ్‌లో ర‌చ్చ చేస్తుంది. వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక సోష‌ల్ మీడియాలోను త‌గ్గేదే లే అంటుంది. తాజాగా టాలీవుడ్‌ బుట్టబొమ్మ మరోసారి రెచ్చిపోయింది. లైగట్ గ్రీన్ క‌ల‌ర్ లెహంగాలో హోయలు పోయింది. వెస్ట్రన్‌ దుస్తుల్లో కత్తిలాంటి పోజులిచ్చింది పూజా. వయ్యారాలు ఒలకబోస్తూ, తన ఫ్రంట్‌, సైడ్‌లో షేపులు చూపిస్తుంది. కత్తిలాంటి చూపులతో కుర్రాళ్ల హృదయాలను గుచ్చేస్తుంది.

pooja hegde latest photos on instagram

pooja hegde latest photos on instagram

Pooja Hegde : ర‌చ్చ మాములుగా లేదు..!

ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. పూజా హెగ్డే కొత్త గ్యాపిచ్చి ఇప్పుడు మళ్లీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అయిపోయింది. ప్రస్తుతం ఆమె వరుసగా తన సెక్సీ ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. డస్కీ బ్యూటీ అందాలను చూపిస్తూ కుర్రాళ్లని ఖుషి చేస్తుంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్‌ కేక్‌లా మారింది. తెలుగులో మాత్రం పూజాకు లైఫ్ ఇచ్చింది మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా.. అరవిందసమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో సినిమాలు చేసింది. వరుస సినిమాలు చేయడంతో వీరిద్దరి మధ్య కుచ్ కుచ్ హోతాహై అనే టాక్ వినిపించింది. కాని అవ‌న్నీ ప‌ట్టించుకోకుండా పూజా సినిమాలు చేస్తూ దూసుకు వెళుతుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది