Pooja Hegde : పూజా హెగ్డే మైండ్ బ్లోయింగ్ లుక్స్.. ఏమందం అమ్మ‌డు ఇది అంటూ కామెంట్ల వ‌ర్షం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pooja Hegde : పూజా హెగ్డే మైండ్ బ్లోయింగ్ లుక్స్.. ఏమందం అమ్మ‌డు ఇది అంటూ కామెంట్ల వ‌ర్షం

Pooja Hegde: అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో కుర్ర‌కారుకి చాలా దగ్గ‌రైంది పూజా హెగ్డే. గ్లామర్ లుక్, మంచి నటనతో టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు పేరు తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా పూజా ఎదిగింది. అయితే వరుసగా ఇప్పుడు పూజా చేస్తున్న సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. దీంతో ఆమెపై నెటిజన్లు భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆచార్య,రాధే శ్యామ్,బీస్ సినిమా ప్లాప్‌ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది పూజా. అంతేకాదు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :29 May 2022,12:30 pm

Pooja Hegde: అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో కుర్ర‌కారుకి చాలా దగ్గ‌రైంది పూజా హెగ్డే. గ్లామర్ లుక్, మంచి నటనతో టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు పేరు తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా పూజా ఎదిగింది. అయితే వరుసగా ఇప్పుడు పూజా చేస్తున్న సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. దీంతో ఆమెపై నెటిజన్లు భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆచార్య,రాధే శ్యామ్,బీస్ సినిమా ప్లాప్‌ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది పూజా. అంతేకాదు తనను ఐరెన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్న వారికి కూడా గట్టిగా సమాధానం ఇచ్చింది.

ఇటీవల, పూజా నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఆమె ఐరెన్ లెగ్ అంటూ.. ఆమెను పెట్టుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది .. పూజ హెగ్డే ఐరెనెలెగ్ హీరోయిన్ అంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై గత కొన్నిరోజులుగా సైలెన్స్‌గా ఉన్న పూజా ఇటీవ‌ల మౌనం వీడింది. ఓటమి మరియు ఉల్లాసం జీవితంలో ఒక భాగం. నేను 6 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ చేసాను. దీనికి నేను సంతోషిస్తున్నాను. అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. పూజాహెగ్డే కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తన అంద చందాలతో పాటు నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే ఒక్కో సినిమాకి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అంతేకాదు ఆమెకు ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సముద్ర తీరంలో కోట్లలో విలువ చేసే త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ ఉందని, కొన్ని ఫ్లాట్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈమెకు మొత్తంగా రూ.51 కోట్ల వరకు ఆస్తి ఉందని అంటున్నారు. ఇక సోష‌ల్ మీడియాలోఈ అమ్మ‌డి ర‌చ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.కేక పెట్టించే అందాల‌తో మైండ్ బ్లాక్ చేస్తుంటుంది. తాజాగా పూజా మెరిసే డ్రెస్‌లో మెంట‌లెక్కించింది. పూజా స్ట‌న్నింగ్ లుక్స్ పిచ్చెక్కిస్తున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది