Pooja Hegde: టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న పూజా హెగ్డే ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌తో తెగ బిజీగా ఉంది పూజా హెగ్డే. వెరైటీ డ్రెస్సులలో ఈ అమ్మడు అందాల రచ్చ చేస్తూ ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది. ముఖ్యంగా పలువురు హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్ అని, సెట్‌లో సందడిలా ఉంటుందన్నారు. ఆయనకు డైలాగ్స్ పై కమాండ్ ఉందని, ఏ సీన్ అయినా ఈజీగా చేసేస్తాడని చెప్పింది. అలాగే బన్నీ కూడా ఎన్టీఆర్ లాగే అని పేర్కొంది. మరోవైపు ప్రభాస్ గురించి చెబుతూ ఆయన చాలా షై పర్సన్ అని పేర్కొంది.
`రాధేశ్యామ్` షూటింగ్ సమయంలో తనతో ఉన్న వారికి కరోనా సోకిందని, దీంతో తనకు కుకింగ్ చేయడం కష్టమైందని, దీంతో ప్రభాస్ తన ఇంట్లో వంట ప్రిపేర్ చేయించి పంపించారని తెలిపారు. సినిమాలో `మీరు పెళ్లి ఎందుకు ఇంకా చేసుకోలేదనే ప్రశ్నకి ఆయన్నుంచి సమాధానం రాలేదని, రియల్ లైఫ్‌లోనూ చెప్పలేదని పేర్కొంది పూజా. తన ప్రేమాయణం గురించి మాట్లాడుతూ.. `ప్రేమించేంత టైమ్ లేదని పేర్కొంది. వరుసగా తెలుగు, తమిళం, హిందీ సినిమాలు చేస్తున్నానని, సినిమా షూటింగ్‌లతోనే బిజీగా ఉంటున్నానని ప్రేమించేందుకు సమయం దొరకలేదని, ఇంకా ఆలోచన రాలేదని పేర్కొంది.`రాధేశ్యామ్` లాంటి లవ్ స్టోరీస్ అంటే ఇష్టమని, వాటిని బాగా ఇష్టపడతానని చెప్పింది. కాకపోతే ఈ చిత్రంలో లవ్ చాలా సీరియస్‌గా, మెచ్యూర్డ్ గా ఉంటుందని చెప్పింది పూజా.
ఆస్ట్రాలజీ గురించి చెబుతూ, తాను జ్యోతిష్యాన్ని నమ్ముతానని పేర్కొంది. రియల్ లైఫ్‌లో చాలా సార్లు జ్యోతిష్యుల వద్దకి వెళ్లానని పేర్కొంది. తనకు `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` నుంచి కొత్తగా వస్తున్న పాత్రలన్నీ బలమైనవని, ఇలాంటి పాత్రలు రావడం అదృష్టంగా భావిస్తుందట. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ గా రాణించడంపై స్పందిస్తూ, తాను నెంబర్ గేమ్ నమ్మనని, అది తాత్కాలికమని పేర్కొంది. తాను పోయెట్‌ని ఇష్టపడతానని, తెలుగు సినిమాలంటే ఇష్టమని పేర్కొంది. తెలుగులో సినిమాల కోసం బాలీవుడ్ ఆఫర్స్ ని కూడా వదులుకున్నట్టు తెలిపింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.