Home » Entertainment » Pooja Hegde Remuneration Giving To Producers
Entertainment

Pooja Hegde : అవకాశాలు తగ్గినా అది మాత్రం తగ్గేదే లేదంటున్న పూజా హెగ్డే

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 30, 2022, 6:30 pm
Advertisement

Pooja Hegde : డీజే సినిమా తో టాలీవుడ్ లో టాప్ స్టార్‌ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. గత నాలుగు అయిదు సంవత్సరాలుగా ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. సినిమా సినిమాకు ఈ అమ్మడి క్రేజ్ పెరుగుతూనే ఉంది. కోటి నుండి రెండున్నర కోట్లకు పైగా పారితోషికంను ఈమె తీసుకుంది. రాధేశ్యామ్‌ సినిమా లో నటించిన ఈ అమ్మడు ఆ సినిమా విడుదల కోసం వెయిట్‌ చేస్తుంది. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమా తో గత ఏడాది వచ్చిన ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ఆఫర్లను దక్కించుకోలేక పోతుంది. స్టార్‌ హీరోలు దాదాపు అందరు కూడా ఈమె తో వర్క్‌ చేశారు. దాంతో ఈమెను పెద్దగా పట్టించుకోవడం లేదు.

Advertisement

హీరోయిన్ గా తెలుగు లో ఇప్పుడు ఈమె చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. ఈమె నటించిన సినిమాలు ఆచార్య మరియు రాధేశ్యామ్‌ లు విడుదల అయితే ఆఫర్లు మళ్లీ వస్తాయేమో చూడాలి. కాని ఈ సమయంలో ఆమె పారితోషికం విషయంలో మరీ అతి గా ప్రవర్తిస్తుంది అంటూ విమర్శలు వస్తున్నాయి. టాలీవుడ్‌ లో సినిమాకు కమిట్‌ అవ్వాలంటే రెండున్నర కోట్లు కావాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తుందట. తెలుగు లో ఈ అమ్మడు చేస్తున్న సినిమాల సంఖ్య పెద్దగా లేదు అనే విషయం అందరికి తెల్సిందే. అయినా కూడా ఈ అమ్మడి పారితోషికం అమాంతం పెంచేసింది. తమిళంలో బీస్ట్‌ సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

pooja hegde remuneration giving to producers

Advertisement

Pooja Hegde : పారితోషికం విషయంలో రష్మిక మందన్నాతో పూజా హెగ్డే పోటీ

ఆ ఒక్క సినిమా మినహా తమిళంలో కూడా ఈమె సినిమాలు చేస్తున్న దాఖలాలు లేవు. అయినా కూడా ఈమెకు పారితోషికం విషయంలో మాత్రం రాజీ పడాలని లేదట. రెండున్నర కోట్ల రూపాయల పారితోషికం అంటే రష్మిక మందన్నా స్థాయిలో ఈమె డిమాండ్ చేస్తుంది. రష్మిక కూడా ప్రస్తుతం అదే పారితోషికం తీసుకుంటుంది. కాని ఇప్పుడు ఇద్దరి మద్య పోలిక కుదరదు. ఎందుకంటే రష్మిక తాజాగా పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. ఒక వేళ రాధేశ్యామ్‌ సక్సెస్ అయితే అప్పుడు పూజా హెగ్డే ఆ స్థాయిలో డిమాండ్‌ చేసినా ఏమైనా ఫలితం ఉంటుందని కొందరు అంటున్నారు. ముద్దుగుమ్మ రష్మిక మందన్నా మరియు పూజా హెగ్డేలు పారితోషికం విషయంలో పోటీ పడటం కరెక్ట్‌ కాదు అనేది కొందరి అభిప్రాయం.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి