Pooja Hegde : అందాల ఆరబోతలో రెచ్చిపోతున్న పూజా హెగ్డే.. రీసెంట్ ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే..

Authored By mallesh | The Telugu News | Published on: March 13, 2022, 1:00 pm

Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం తన జోరు చూపిస్తోంది. టాలీవుడ్ లో వరుసగా పెద్ద హీరోల సరసన సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. టాలీవుడ్ నెం.1 స్టార్ హీరోయిన్ అనే హోదాను ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతోంది. ఈ అమ్మడు సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. హాట్ ఫొటో షూట్లు కూడా చేస్తోంది. ఇలా చేసిన హాట్, హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవలే ఈ చిన్నది నటించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ విడుదలై మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.

ఇక మెగా పవర్ స్టార్ సరసన నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ బ్యూటీ హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఐటం గర్ల్ గా కూడా తన జోరును చూపిస్తోంది. రంగస్థలం సినిమాలో ఈ అమ్మడు చేసిన జిగేలు రాణి పాటను ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు.పూజా హెగ్డే కు ఎంట్రీ ఇవ్వడంతో నే హిట్లు రాలేదు. ఈ చిన్నది ఎప్పుడో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కానీ హిట్ మాత్రం అప్పుడు రాలేదు. ముకుంద, యువ సామ్రాట్ నాగచైతన్యతో ఒక సినిమా చేసినా కూడా ఈ హాట్ భామకు హిట్ రాలేదు. దీంతో ఈ చిన్నది బాలీవుడ్ కి వెళ్లింది.

pooja hegde viral pics

pooja hegde viral pics

Pooja Hegde : రూన్ క‌ల‌ర్ డ్రెస్సులో..

అక్కడ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి మొహంజోదారో అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా కూడా ప్లాప్ గా నిలిచింది. ఇక ఈ భామ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాధం సినిమాలో కనిపించి క్లిక్ అయింది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పుడు మెరూన్ క‌ల‌ర్ డ్రెస్సులో హొయ‌లు పోతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp