
Poorna shared wedding photos on Instagram
Poorna : ఒకప్పుడు హీరోయిన్‌గా నటించి అలరించిన పూర్ణ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది. అడపాదడపా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తూ అలరిస్తుంది. కెరీర్ పరంగా ఆ మధ్య కొంత గ్యాప్ వచ్చినా ఇప్పుడు మళ్లీ పుంజుకుంది పూర్ణ. ఓ మోస్తారు నుంచి, చిన్న బడ్జెట్ చిత్రాలు చేస్తుంది. సౌత్‌లో చాలా బిజీగా ఉంది పూర్ణ. ఇటీవల తెలుగులో `అఖండ`, `దృశ్యం2`,`తీస్ మార్ ఖాన్` చిత్రాలతో మెప్పించింది. సినిమాలతోపాటు `ఢీ` వంటి షోకి జడ్జ్ గా చేస్తుంది పూర్ణ. అయితే దీపావళి సందర్భంగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఆశ్చర్యపరచింది పూర్ణ .
ఈ భామ ఆ మధ్య దుబాయ్ బేస్డ్ ఇండియన్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీ( ని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పెళ్లి ఫోటోలను పంచుకుని సర్‌ప్రైజ్‌తో కూడిన షాకిచ్చింది. మే నెలలో పూర్ణ ఎంగేజ్మెంట్ జరగాక కాబోయే వరుడుతో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అలా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఇక నవంబర్ లో పూర్ణ వివాహం ఉంటుందనే వార్తలు బాగా వైరల్ గా మారాయి. ఇటీవల ఒక మీడియాతో స్పందించిన పూర్ణ జూన్ 12వ తారీకున తమ వివాహం జరిగిందంటూ ట్విస్ట్ ఇచ్చింది పూర్ణ.
Poorna shared wedding photos on Instagram
పలు సమస్యల వలన అందరు దుబాయ్ రాలేకపోయారు అని పూర్ణ చెప్పుకొచ్చింది. ఇక తాజాగా పెళ్లికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ అలరించే ప్రయత్నం చేసింది. పూర్ణ పెళ్లి ఫోటోలు విషయానికి వస్తే పట్టుచీరలో నిండా నగలతో బుట్ట బొమ్మల కనిపిస్తోంది. పెళ్లికూతురు దుస్తులలో మరింత అందంగా కనిపిస్తోంది.తన చుట్టూ ఉన్న అమ్మాయిలకు అసూయ పుట్టేలా తన అందంతో పూర్ణ అక్కడ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక ముస్లిం సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగినట్లుగా ఈ ఫోటోలు చూస్తే మనకి అర్థమవుతోంది. త్వరలో కేరళలో పూర్ణ తన రిసెప్షన్ జరుపుకోనుందని, ఈ కార్యక్రమానికి ఎవరెవరని పిలుస్తుందో చూడాలి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.