Poorna : సినీ ఇండస్ట్రీ అంటేనే అదో రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో ఎదగాలంటే చాలా కష్టపడాలి. ఎన్నో త్యాగాలు చేయాలి. అనుకున్నవన్నీ ఇండస్ట్రీలో జరగవు. కొందరు హీరోయిన్లు ముందు లైమ్ లైట్ లోకి వస్తారు. ఆ తర్వాత కనుమరుగైపోతారు. కానీ.. హీరోయిన్ పూర్ణ మాత్రం ముందు అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ.. తర్వాత హీరోయిన్ గా, జడ్జిగా, డ్యాన్సర్ గా పలు అవకాశాలు చేజిక్కించుకొని ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత తను పెళ్లి చేసుకొని ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అయింది. అయితే.. పూర్ణకు రవిబాబు డైరెక్షన్ లో నటించిన అవును, అవును 2 సినిమాలతో రేంజ్ పెరిగింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఆ తర్వాత తనకు బుల్లితెర మీద కూడా చాలా అవకాశాలు వచ్చాయి. అంతే కాదు.. రవిబాబు, పూర్ణ మధ్య సంబంధం కూడా అంటగట్టారు నెటిజన్లు. కానీ.. అవన్నీ పుకార్లే అని ఏకంగా రవిబాబే స్టేట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. హీరోయిన్ పూర్ణ విషయంలో జరిగిన తప్పును రవిబాబే.. ఇటీవల అలీతో సరదాగా గేమ్ షోలో చెప్పుకొచ్చాడు.పూర్ణ విషయంలో ఒక విషయంలో మాత్రం తప్పు జరిగింది. ఆమె నా డైరెక్షన్ లో సినిమాలు చేసింది కానీ.. మా మధ్య ఏం లేదు. అది కేవలం డైరెక్టర్, హీరోయిన్ మధ్య ఉన్న రిలేషన్ షిప్ మాత్రమే. చీప్ రేట్ కు హీరోయిన్ దొరకాలనే ఎవరైనా అనుకుంటారు. నేనూ అదే అనుకున్నా.
అదే చేశా. నా సినిమాలకు అందుకే తనను హీరోయిన్ గా తీసుకున్నా. అయితే.. అవును సినిమా పోస్టర్ కోసం రెండు ఏనుగులు ఆమెను పట్టుకున్నట్టుగా ఉండే పోస్టర్ ను డిజైన్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశాం. దాని కోసం పూర్ణను తాడులతో కట్టేసి గంటసేపు అలాగే వేలాడదీశాం. దీంతో పూర్ణ నరకయాతన అనుభవించింది. ఆ తర్వాత కిందికి దించాక.. కెమెరా మెన్ ఫోటో తీయలేదు. ఎందుకంటే.. కెమెరాలో చిప్ పెట్టడం మరిచిపోయాడు. నాకు వచ్చి ఆ విషయం చెప్పాడు. దీంతో పూర్ణకు అదే విషయం చెప్పా. దీంతో ఆమె కోపంతో ఊగిపోయింది. కానీ.. తనకు నచ్చజెప్పడంతో మళ్లీ తనను అలాగే తాళ్లతో కట్టేసి వేలాడదీయాల్సి వచ్చింది. అప్పుడు కూడా తను ఆ నొప్పిని చాలా భరించింది.. అంటూ రవిబాబు ఆ సినిమా షూటింగ్ తాలుకు విషయాలను తాజాగా గుర్తు చేశాడు.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.