Prabhas : ప్ర‌భాస్‌కి స‌ర్జ‌రీ.. ఏమైందా అని ఆందోళ‌న చెందుతున్న అభిమానులు

Authored By Sam C | The Telugu News | Published on: July 28, 2022, 8:20 pm

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. బాహుబ‌లి కోసం దాదాపు ఐదేళ్లు ప‌ని చేయ‌డంతో ప్ర‌భాస్ అభిమానులు ఆయ‌న సినిమాల‌ని చాలా మిస్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ నాన్‌స్టాప్ సినిమాలు చేస్తున్నారు. ఇందులో ప్రాజెక్ట్ కె చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె అవుట్ ఫుట్ టెర్రిఫిక్ గా ఉందని అన్నారు అశ్వినిద‌త్. ఈ చిత్రాన్ని అమెరికా, చైనాతో పాటు అనేక దేశాల్లో పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ చేస్తాం. అవెంజర్స్ తరహాలో ఉండబోతోంది. 2023 జనవరి కల్లా షూటింగ్ పూర్తవుతుంది. 8 నెలల పాటు విఎఫెక్స్ వర్క్ ఉంటుంది. కుదిరితే 2023 అక్టోబర్ 18న రిలీజ్ చేస్తాం. అదే నెలలో ప్రభాస్ బర్త్ డే కూడా ఉంది. కుదరకపోతే 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అని అశ్విని దత్ అన్నారు.

Prabhas : ఫ్యాన్స్ ఆందోళ‌న‌..

అలానే ప్ర‌భాస్ స‌ర్జరీ గురించి కూడా తెలియ‌జేశారు అశ్వినీద‌త్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కాలికి సర్జరీ నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్ళాడట. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ వెల్లడించారు. వాస్తవానికి, ‘సీతారామం’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కోసం ప్రభాస్ రావాల్సి వుందనీ, అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయాడని చెబుతూ, ప్రభాస్ కాలికి సర్జరీ విషయాన్ని నిర్మాత అశ్వనీదత్ బయట పెట్టారు. దీంతో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ఏమైందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

prabhas fans tensed with his health

prabhas fans tensed with his health

రెబల్ స్టార్ ప్రభాస్ ఈ యేడాది ‘రాధే శ్యామ్’ తో ప్రేక్షకులను నిరాశ పరిచారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్‌తో సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా వచ్చే యేడాది విడుదల కానుంది. మరోవైపు ’సలార్’ షూటింగ్ చివరి దశకు వచ్చింది. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ లైన్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తోన్న ‘సలార్’ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp