
Prabhakar Fire On Trollings On His Son Chandrahas
Prabhakar : బుల్లితెర మెగాస్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాకర్. ఒకప్పుడు ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ అడపాదడపా సీరియల్స్ చేస్తున్న ప్రభాకర్ ఇప్పుడు తన కొడుకు చంద్రహాస్‌ని సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకేసారి మూడు సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడంటూ ప్రభాకర్ తెలిపారు. తన కొడుకు చాలా హార్డ్ వర్కర్ అని.. మంచి హీరో అవుతాడని ఇటీవల ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ చెప్పుకొచ్చారు. అయితే ఆ ప్రెస్ మీట్ లో చంద్రహాస్ ప్రవర్తన తీరుపై నెట్టింట భారీ ట్రోలింగ్ జరుగుతోంది. మీమ్స్, వీడియోలతో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ‘ఒక్క సినిమా కూడా తీయలేదు.. అప్పుడే అంత బలుపేంటి..’ అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు.
దీంతో ప్రభాకర్ తన కొడుకు పై ట్రోల్ చేస్తున్న వారిపై బాగా క్లాస్ పీకాడు.నా కొడుకుని ట్రోల్ చేస్తే జైల్లో పెడతా అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అయిన కొందరు టోలర్స్ ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.ఇక మరికొందరు ప్రభాకర్ కొడుకు హీరోగా బాగా రాణించాలి అని కోరుకుంటున్నారు. చంద్రహాస్ ఇటీవలనే డిగ్రీ పూర్తి చేశాడు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నది ఆయన లక్ష్యం. ఈ మేరకు తన పెర్ఫామెన్స్ ను చూపించేందుకు రూ.10 లక్షలతో కవర్ సాంగ్ కూడా చేశాడు. ఇటీవల ఆయన బర్త్ డే సందర్భంగా తొలి సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో రెండు చిత్రాలు కూడా కన్ఫమ్ అయినట్టు తెలుస్తోంది.
Prabhakar Fire On Trollings On His Son Chandrahas
అయితే ప్రభాకర్.. ఇట్స్ గుడ్. వైరల్‌గా వెళ్లిపోతుంది. ఎలాగైతేనేం తెలిసిపోయాడు. వాళ్లు తిడుతున్నారా.. పొగుడుతున్నారా.. అనేది పక్కన పెడితే జనాలకు తెలిశాడు. తరువాత వాడు ఎంత బాగా చేస్తే.. అంతబాగా ఆదరిస్తారు. ఇప్పుడు వాడు నిలబడిన స్టైల్ వాళ్లకు నచ్చలేదు. అందుకే నచ్చలేదని చెప్పారు. వాడు చేసిన యాక్టింగ్ నచ్చితే ఆకాశానికి ఎత్తేస్తారు. బాగా పర్ఫామెన్స్ చేస్తే మెచ్చుకుంటారు..” అంటూ చెప్పుకొచ్చారు. గతంలో కొంత నటులకు సన్ స్ట్రోక్ తగిలిందని.. అయితే ఎవరికీ తెలిసి తగల్లేదన్నారు. బిడ్డ భవిష్యత్ కోసం కష్టపడే క్రమంలో తగిలిందని.. తనకు సన్ స్టోక్ తగిలితే నిమ్మకాయ రసం తాగుతా అని నవ్వుతూ చెప్పారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.