Home » Entertainment » Prabhas Adipurush Movie In Amazon Ott Streaming
Entertainment

Adipurush Movie : ఇది కదరా అద్దిరిపోయే బ్రేకింగ్ అంటే :: OTT లో ఆదిపురుష్ సినిమా .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

Authored By
aruna
The Telugu News | Published on: June 11, 2023, 9:00 pm
Advertisement

Adipurush Movie : త్వరలోనే ప్రభాస్ నటించిన ‘ ఆదిపురుష్ ‘ సినిమా విడుదల కాబోతుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా రెండు ట్రైలర్స్, పాటలు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. బాలీవుడ్ లో ఈ ఏడాది పఠాన్ తర్వాత వస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు ఈ సినిమా.

Advertisement

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా, రన్వీర్ సింగ్ రావణుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ చేసే యుద్ధ విన్యాసాలు అభిమానులను బాగా ఆకట్టుకుంటాయి అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆదిపురుష్ సినిమా చూడటం కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా 550 కోట్ల వరకు బిజినెస్ చేసింది. అయితే ప్రముఖ ఓటీపీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకు భారీ మొత్తం ఇచ్చి ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. అఫీషియల్ గా ఇప్పటికే ఓటీటీ పార్ట్నర్ని కన్ఫామ్ చేశారు.

Prabhas Adipurush Movie in Amazon OTT streaming

Advertisement

అయితే ఆదిపురుష్ సినిమాని ఓటిటిలో చూడాలంటే కనీసం 50 రోజులు ఆగాల్సిందే. సినిమాకి వచ్చే రెస్పాన్స్ బట్టి ముందు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నారు. ఈ సినిమా ఈజీగా 1000 కోట్ల కలెక్షన్స్ ని సాధిస్తుందని భావిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో పఠాన్ రికార్డుని ఆదిపురుష్ బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రభాస్ ఖాతాలో బాహుబలి 2 తర్వాత ఆది పురుష్ అతిపెద్ద సక్సెస్ అవ్వనుంది. ఆది పురుష్ దేవుడి కథ కాబట్టి ప్రజలు కచ్చితంగా దీనికి కనెక్ట్ అవుతారని అనిపిస్తుంది. తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి