Prabhas : ప్రభాస్ తో పాటు కమల్ హాసన్ .. వావ్ థియేటర్ లలో పండగే !

Authored By Breaking News | The Telugu News | Published on: May 31, 2023, 7:00 pm

పాన్ ఇండియా సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన తర్వాత ప్రభాస్ కి సరైన హిట్ పడలేదన్న సంగతి తెలిసిందే. 2018లో బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహూ, రాధేశ్యామ్ రెండు కూడా పరాజయాలు పాలయ్యాయి. కాగా ఫస్ట్ టైం తెలుగు దర్శకుడు తో కాకుండా ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందిన “ఆదిపురుష్”తో జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులకు భారీ అంజనాలు ఉన్నాయి.

prabhas along with kamal haasan wow in theaters

prabhas along with kamal haasan wow in theaters

ఇక వీటితోపాటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టుకే సినిమాలు చేస్తున్నాడు. అయితే వీటిలో “ప్రాజెక్టు కె”లో బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన భారీ తారాగణం నటిస్తోంది. అమితాబ్, దీపికా పదుకొనే, దిశాపటాని ఇంకా చాలామంది నటీనటులు కనిపిస్తున్నారు. కాగా ఈ సినిమాలో విలన్ పాత్రకి సంబంధించి సరికొత్త న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేమిటంటే యూనివర్సల్ యాక్టర్ కమలహాసన్ నెగిటివ్ పాత్రలో ప్రభాస్ తో .. “ప్రాజెక్ట్ కె”లో తలపడబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Project K: Kamal Haasan to play antagonist against Prabhas; offered a  Whopping Rs 150 Crore | Viral - PTC Punjabi

 

దాదాపు 30 నిమిషాల పాటు కమల్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఓ రేంజ్ లో డైరెక్టర్ నాగ అశ్విన్ తీర్చిదిద్దినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదే కనుక నిజమైతే థియేటర్లలో పండగే అని సినిమా ప్రేక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి 75% షూటింగ్ కంప్లీట్ అయినట్లు నిర్మాత స్వప్న దత్ ఇటీవల క్లారిటీ ఇవ్వటం జరిగింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి సరికొత్త అప్డేట్ కూడా ఇవ్వటానికి మేకర్స్ రెడీ అవుతున్నట్లు సమాచారం.

Breaking News

No bio available for this author.

  1. "Aakasamlo Oka Tara Movie Review : ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  2. "Aadhaar Card New Rules : ఆధార్‌లో పేరు మార్చడం ఇక అంత ఈజీ కాదు.. సెప్టెంబర్ 18 కొత్త రూల్స్ ఇవే..!"

  3. "Gold Rate Today : మ‌హిళ‌ల‌కు ఇదే మంచి చాన్స్‌.. బంగారం రూ.12,100, వెండి రూ.24,000 త‌గ్గిన ధ‌ర‌లు..!"

  4. "TDP YSRCP Janasena : టీడీపీ, వైసీపీ, జనసేనలో ఒకటే సమస్య.. అధిష్ఠానాలకు కొత్త స‌వాళ్లు..!"

  5. "US Green Card New Rules : అమెరికాలో ఉండే ఇండియ‌న్స్ కు బిగ్‌న్యూస్‌.. గ్రీన్ కార్డ్ కొత్త‌ రూల్స్ ఇవే..!"

  6. "VS Babu Passes Away : బ్రేకింగ్ న్యూస్‌.. విజయ్ పార్టీలో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత..!"

  7. "Telangana : గుడ్‌న్యూస్.. తెలంగాణలో కొత్త పింఛన్ల తేదీ ఖరారు.. మీ ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడతాయంటే?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp