Home » Entertainment » Prabhas Anushka Marriage News
Entertainment

Prabhas Anushka : ప్రభాస్ ని కలిసిన అనుష్క తండ్రి.. త్వరలోనే పెళ్లి..

Authored By
aruna
The Telugu News | Published on: October 9, 2023, 8:00 pm
Advertisement

Prabhas Anushka : టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ లో ప్రభాస్, అనుష్క కాంబినేషన్ కూడా ఒకటన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ , అనుష్క కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. దీంతో ఈ కాంబినేషన్ కి ప్రేక్షకులలో క్రేజ్ అంతకంతకు పెరుగుతుంది. ఈ కాంబినేషన్లో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే తాజాగా ప్రభాస్ ని అనుష్క తండ్రి కలవడం జరిగింది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు ప్రభాస్ అనుష్కలకి ఇప్పటికీ పెళ్లి కాకపోవడంతో వీరిద్దరూ కలిసి ఏదైనా శుభవార్త చెబుతారేమో అని ఆసక్తిగా చూస్తున్నారు.

Advertisement

ప్రభాస్ అనుష్క ల గురించి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు గతంలో కూడా వీరిద్దరిపై సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ప్రభాస్ అనుష్క వెరే వెరే సందర్భాలలో తామిద్దరం మంచి స్నేహితులం అని, మా మధ్య అటువంటిది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఇక సినిమాల పరంగా ప్రభాస్ అనుష్క రెమ్యూనరేషన్ భారీ రేంజ్ లో ఉందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసేవన్ని పాన్ ఇండియా సినిమాలే. అవన్నీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

Prabhas Anushka marriage news

Advertisement

ప్రభాస్ త్వరలోనే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టు కే, రాజా డీలక్స్, స్పిరిట్ సినిమాలతో రానున్నారు. ఇక అనుష్క సినిమా సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ఇటీవల అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించారు. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. సినిమాల పరంగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ అనుష్క వ్యక్తిగతంగా ఇద్దరు ఒకటవ్వాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. మరి ప్రభాస్ అనుష్క ఏం చేస్తారో చూడాలి. ఇకనైనా సోషల్ మీడియాలో వచ్చే పెళ్లి వార్తలపై చెక్ పెడతారో లేదో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి