Prabhas : బాలయ్య అన్ స్టాపబుల్ షోలో స్టార్ హీరోయిన్ కు ఫోన్ చేసిన ప్రభాస్.. ఆమె ఏమన్నదో అందరూ విని షాక్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 13, 2022, 12:00 pm

Prabhas : తెలుగు వెండి తెర మీదనే కాదు.. బుల్లి తెర మీద కూడా నటసింహ నందమూరి బాలకృష్ణ దూసుకుపోతున్నారు. ఆహా ఓటీటీలో వచ్చే అన్ స్టాపబుల్ షోతో తనేంటో నిరూపించుకున్నారు. తనకు మాట్లాడే సత్తా ఉందని.. హోస్టింగ్ లో అదరగొట్టేస్తానని చెప్పేశారు. ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ నడుస్తోంది. మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ ను ఇటీవలే ప్రారంభించారు. దానికి సంబంధించిన పలు ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి. తాజా ఎపిసోడ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను తీసుకొచ్చాడు బాలకృష్ణ.

సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కే చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ ను తీసుకొచ్చాడు బాలయ్య బాబు. ఆ తర్వాత ప్రసారమైన నాలుగు ఎపిసోడ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఆరో ఎపిసోడ్ కు యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ తో పాటు మ్యాచ్ స్టార్ గోపీచంద్ ను ఇన్వైట్ చేశాడు బాలకృష్ణ. ప్రభాస్, గోపిచంద్ తో బాలయ్య బాబు ఆరో ఎపిసోడ్ షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయిందట. దానికి సంబంధించిన ప్రోమోను కూడా ఇటీవలే లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ కు ప్రభాస్ తో పాటు మరో ఆరడుగుల హీరో గోపీచంద్ ను బాలయ్య బాబు ఎందుకు ఇన్వైట్ చేశారో తెలియాలంటే ఆ షో ప్రసారం అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.

prabhas calls to star heroine from balakrishna unstoppable show

prabhas calls to star heroine from balakrishna unstoppable show

Prabhas : ప్రభాస్ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి

ఈ ఎపిసోడ్ కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31న ప్రసారం కానుంది. అయితే.. ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కు బాలయ్య ఫోన్ చేసి ప్రభాస్ కు ఇస్తాడట. దీంతో ప్రభాస్.. తన రొమాంటిక్ డైలాగ్స్ తో శృతిని ఆటపట్టించాడట. ప్రభాస్ తో పాటు.. బాలయ్య బాబు కూడా శృతితో ఆడుకున్నారట. శృతి ఎపిసోడే ఈ ఎపిసోడ్ లో హైలెట్ అని అంటున్నారు. అయితే.. శృతి హాసన్ ప్రస్తుతం బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తోంది. ప్రభాస్ తో సలార్ సినిమాలోనూ నటిస్తోంది. అందుకే ఇద్దరూ కలిసి తనను అలా ఆటపట్టించినట్టు తెలుస్తోంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp