Prabhas – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానిని చంపేసిన ప్రభాస్ అభిమాని వెనక బిగ్ ట్విస్ట్ !
Prabhas – Pawan Kalyan : తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానికి ప్రభాస్ అభిమానికి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో ఒకరు మృతి కూడా చెందారు. హీరో అంటే అభిమానం ఉండాలి కానీ మరి ఇంతలా దిగజారాల అని జనాలు తిట్టిపొస్తున్నారు. హీరోలంతా ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉంటారు. కానీ వీరిని అభిమానించే అభిమానులు మాత్రం కొట్టుకు చస్తున్నారు. మా హీరో తోప్ అంటే లేదు మా హీరోనే తోపు అంటూ చివరికి ప్రాణాలను తీసుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ సంఘటన గురించి నోట మాట రాదు. తణుకు పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తిలి మసీదు వీధిలో ఒక బిల్డింగ్ కు రంగులు వేయడానికి ఏలూరు నుంచి హరి,కిషోర్ లు వచ్చారు.
ఉదయం పని చేసి రాత్రి పనిచేసే బిల్డింగ్ మీద పడుకుంటూ ఉంటారు. వీరిద్దరూ స్నేహితులు కావడంతో వీరిద్దరి మధ్య సినిమాల గురించి చర్చ వస్తు ఉంటుంది. ఇక హరికుమార్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమాని కిషోర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని. అయితే శుక్రవారం రాత్రి వీరిద్దరూ బిల్డింగ్ పైన పడుకున్నప్పుడు ఇద్దరి మధ్య హీరోల గురించి చర్చ నడిచింది. హరి తన వాట్సాప్ స్టేటస్ లో ప్రభాస్ వీడియోని స్టేటస్ గా పెట్టుకున్నాడు. దీనికి కిషోర్ ప్రభాస్ వద్దు పవన్ కళ్యాణ్ వీడియోలను స్టేటస్ లా పెట్టుకొమని చెప్పాడు.
ఇద్దరు మద్యం మత్తులో ఉండడంతో అదే పనిగా మాట్లాడుకోవడం చర్చ పక్కదారి పట్టింది. మద్యం మత్తులో ఉన్న కిషోర్ ప్రభాస్ ను నానా మాటలు అనేశాడు. దీంతో విపరీతమైన కోపానికి గురైన హరి అక్కడే ఉన్న సెంట్రింగ్ కర్రతో కిషోర్ తల మీద బలంగా కొట్టాడు. అంతేకాకుండా సిమెంట్ రాయితో మొహం మీద బలంగా అదమటంతో అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హరికుమార్ ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. హీరో మీద ఉన్న అభిమానం పేరుతో ఇలాంటి పిచ్చి చేష్ఠలు ఏమాత్రం సరికావని నిజాన్ని అంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిదని అంటున్నారు.