
Reading this news does not make sense whether Prabhas fans should be happy or sad
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ పొందిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. చివరిగా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టారు. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ వంటి సినిమాలు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇక అనౌన్స్ చేయకుండానే మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా బిల్లా మూవీ స్పెషల్ షోస్ ని అభిమానులు ఏర్పాటు చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..దీపావళి కానుకగా కొత్త సినిమాలు విడుదల అవ్వడం తో బిల్లా సినిమాకి సాయంత్రం సమయం లో షోస్ దొరకలేదు..దానితో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉదయం 8 గంటలకు షోస్ ని ప్రదర్శించారు..ఈ షోస్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ అభిమానుల అత్యుత్సాహం వల్ల తాడేపల్లిగూడెం లో అపశృతి చోటు చేసుకుంది..తాడేపల్లి గూడెం లో లక్ష్మి నారాయణ కాంప్లెక్స్ లో నేడు బిల్లా సినిమాని 8 గంటల ఆటని ప్రదర్శించారు..థియేటర్ వద్ద అభిమానులు సంబరాలతో హోరెత్తించారు..
prabhas fans fire the theatre
అయితే కొందరు అభిమానులు మరింత అత్యుత్సాహం ప్రదర్శించి థియేటర్ లోపల అభిమానులు సంబరాలు చేసుకోవడంలో చిన్న పాటి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది..చాలా సీట్స్ కాలిపోయాయి కూడా..వెంటనే థియేటర్ సిబ్బంది అప్రమత్తం అయ్యి మంటలు ఆర్పివేయడం తో భారీ పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు అభిమానులు..అయితే వెంటనే ఆ షో ని రద్దు చేసి అభిమానులను వెనక్కి పంపేశారు థియేటర్ యాజమాన్యం.గతం లో జల్సా మరియు పోకిరి స్పెషల్ షోస్ లో కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనలతో థియేటర్ యజమానులు స్పెషల్ షోస్‌తో వణికిపోతున్నారు.
Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన…
School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…
Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్గా…
Mana Shankara Vara Prasad Garu Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…
Bhatti Vikramarka : ప్రజాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…
Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…
Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…
Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…
This website uses cookies.