Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంతో గంతులు వేసే న్యూస్ వచ్చేసింది .. !

Authored By Sam C | The Telugu News | Published on: October 15, 2022, 8:00 pm

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తుండ‌గా, ఆయ‌న నటిస్తున్న చిత్రాలు, కమిటైన మూవీస్ కంప్లీట్ కావడానికి మరో రెండు మూడేళ్లు పడుతుంది. కానీ ప్రభాస్ తో సినిమా చేయాలి అనుకునే దర్శకుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ప్రభాస్ ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా చిత్రాలే చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. త్వరలో ఈ చిత్రం సెట్స్ కి వెళ్లనున్నట్లు టాక్.

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అయితే ప్ర‌భాస్ తో పాటు ఇప్పుడు టాలీవుడ్ లో పోటీ ప‌డే చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. బాలీవుడ్ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతి నెలా దీనిపై సర్వే నిర్వహిస్తోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అన్ని పరిశ్రమలలోని హీరోల ర్యాంకింగ్స్ పై సర్వే నిర్వహిస్తోంది. ఇండియా వైడ్ ఉన్న సినిమా లవర్స్ అభిప్రాయాల ఆధారంగా ర్యాంకింగ్స్ కేటాయిస్తుంది. సెప్టెంబర్ నెల సర్వే ప్రకారం ఆడియన్స్ టాప్ ర్యాంక్ ప్రభాస్ కి ఇచ్చారు.

prabhas fans gets good news

prabhas fans gets good news

Prabhas : గుడ్ న్యూస్..

టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఆయనే అని తేల్చిపారేశారు. అల్లు అర్జున్ టాప్ 3 ర్యాంక్ దక్కించుకున్నారు. రామ్ చరణ్, మహేష్ 4,5 స్థానాలతో టాప్ ఫైవ్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి 6వ ర్యాంక్ ఇచ్చారు ఆడియన్స్. నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. సీనియర్ స్టార్స్ లో ఒక్క చిరంజీవి మాత్రమే టాప్ స్టార్స్ లిస్ట్ లో స్థానం పొందారు. ఇక దేశంలోనే అత్యధిక మార్కెట్ కలిగిన హీరోలు టాలీవుడ్ లో ఉన్నారు. మొత్తానికి టాలీవుడ్ హీరోలు ఇండియ‌న్ సిన‌మా ప‌రిశ్ర‌మ‌ని తెగ దున్నేస్తున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp